Master Bharath: టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి, ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలు అందరి సినిమాల్లో నటించిన భరత్ ఈమధ్య నటుడుగా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈయన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. భరత్ తల్లి కన్నుమూశారు. భరత్ తల్లి కమలాసిని అకాల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భరత్ తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నై లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మీడియా ద్వారా భరత్ కి ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు..
మాస్టర్ భరత్ తల్లి సడన్ డెత్తో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం భరత్ కు తీరని లోటు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారని వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని నివాసంలోనే ఆమెమరణించారని సమాచారం.. దీనిపై భరత్ గాని అధికారికంగా ప్రకటించలేదు. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. భరత్ నటించిన సినిమా హీరోలందరూ ఆయనకు ధైర్యం చెప్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
భరత్ సినిమాల విషయానికొస్తే..
వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మాస్టర్ భరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చిట్టి నాయుడిగా చిన్నతనం నుండి అద్భుత నటనను ప్రదర్శించిన మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ ‘ABCD’ చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు..
Also Read :సౌందర్య చనిపోవడానికి ముందు ఏం జరిగింది..? ఇన్నాళ్లకు బయటపడ్డ సీక్రెట్..
యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ..
ఇటీవల భరత్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.. అందులో ఆయన మాట్లాడుతూ తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.. నాకు ఊహ తెలిసినప్పుటి నుండి సినిమాల్లో నటిస్తూనే ఉన్నా.. మూడేళ్ల వయసు నుండి నటిస్తున్నా. ఒకవైపు సినిమాలు చేస్తూనే మెడిసిన్ పూర్తి చేశా. ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు పెద్దవాడినయ్యా. స్కూల్, కాలేజ్ అంతా అయిపోయింది కాని నేను ఇంకా అమ్మచాటు బిడ్డనే. అమ్మ కోసం ఏదైన చేస్తాను.. లవ్ లాంటివేం లేవు.. కాని ప్రపోజ్‌లు వచ్చేవి.. కానీ ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అలాగే తనకు ఒక కన్ను కనిపించదని చెప్పాడు. ఇంటర్వ్యూలో కూడా తన తల్లి గురించి ఎంత గొప్పగా చెప్పాడో ప్రస్తుతం ఆయన అభిమానులు ఇంటర్వ్యూ వీడియోని షేర్ చేస్తూ భరత్ గురించి కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.