Manchu Vishnu:మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ (Manchu Manoj) కి సెటైర్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా మంచు విష్ణు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పబ్లిక్ లో బయట పెట్టడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేయరు. ఆయన చాలావరకు తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ విషయాలను గోప్యంగానే ఉంచుతారు. అలాంటిది నేడు బహిరంగంగా రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే తన పతనాన్ని కోరుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఎట్టకేలకు బయటపడ్డ అన్నదమ్ముల మధ్య గొడవలు..
గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు (Mohan babu) స్థాపించిన విద్యా సంస్థలలో అవకతవకలు ఏర్పడ్డాయని అడిగినందుకు తనపై దాడి చేశారని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన అన్నయ్య మంచు విష్ణు కొంతమందితో కలిసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని, అడిగినందుకే తనపై దాడి చేశారు అంటూ మంచు మనోజ్ మీడియా ముఖంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు తన తల్లి పుట్టిన రోజు నాడు తన అన్నయ్య జనరేటర్ లో చక్కెర పోసి తనను చంపాలనుకున్నాడు అంటూ మరో కంప్లైంట్ ఇచ్చాడు మంచు మనోజ్. ఆస్తి తనకు రాకుండా తన అన్నయ్య కాజేస్తున్నాడు అనే రేంజ్ లో కూడా కామెంట్లు చేయగా.. మంచు విష్ణు మాత్రం ఈ విషయాలపై ఏ రోజు స్పందించలేదు.
రక్తం పంచుకు పుట్టిన వాళ్లే పతనం కోరుతున్నారు – విష్ణు ఆవేదన
తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) మూవీ పైనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే తన డ్రీమ్ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మరే ఇతర విషయాలపై స్పందించను అని కూడా స్పష్టం చేశారు మంచు విష్ణు. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమా షూటింగ్ పూర్తి అయింది. విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈయన ఒక్కసారిగా పాడ్ కాస్ట్ లో పాల్గొని తన బాధను వెళ్ళబుచ్చుకున్నారు. పాడ్ కాస్ట్ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ..” రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే ఈరోజు నా పతనాన్ని కోరుతుంటే ఇంకెవరు నా మంచి కోరుకుంటారు” అంటూ మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన నాశనాన్ని తన తమ్ముడు మంచు మనోజ్ కోరుకుంటున్నాడు అంటూ బహిరంగంగానే ప్రకటించాడు మంచు విష్ణు. మొత్తానికైతే ఇన్ని రోజులు కుటుంబ విషయాలు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడ్డ మంచు విష్ణు స్వయంగా తన తమ్ముడితో తనకు విభేదాలు ఉన్నాయని ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మంచు మనోజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబు (Manchu Mohanbabu) అడుగుజాడల్లోనే ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.
ALSO READ:Pawan Kalyan: హరిహర వీరమల్లు సినీమా రిలీజ్ పై.. కొత్త పంచాయితీ..?