BigTV English
Advertisement

New Delhi : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి

New Delhi : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి

3 Students Dead After Flooding In Delhi Coaching Centre Basement : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి సైతం చేరుకుంటోంది. ఇదే క్రమంలో అక్కడ రాజేంద్ర నగర్ ప్రాంతంలో రోడ్డుకు దిగువగా ఓ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. బయట మూమూలు వర్షమే అనుకున్నారు. సరిగ్గా శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో దిగువ ప్రాంతంగా ఉన్న రాజేంద్రనగరకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. అనుకోని విధంగా వచ్చిన వరద నీటినుండి బయటపడేందుకు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు రాబోతుండగా మరింత ఉధృత స్థాయిలో వదర నీరు వచ్చిపడింది. దీనితో దాదాపు 30 మంది విద్యార్థులు వరదనీటిలో చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వచ్చే లోగా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. దీనితో ఆందోళనతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు.


విద్యార్థి సంఘాల ఆందోళన

మరి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా కోచింగ్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. వర్షం వస్తోందని తెలిసినా కోచింగ్ సెంటర్ లో విద్యార్థులను పంపించకుండా వారి ప్రాణాలతో ఆడుకున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా అక్కడికి చేరుకుని గత 15 సంవత్సరాలుగా బీజేపీ ఆధీనంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నడుస్తోందని ఇదంతా బీజేపీ అసమర్థతనం బయటపడుతోందని ఆప్ నేతలు విమర్శలకు దిగారు. ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని బీజేపీ నేతలు అంటున్నారు. విద్యార్థుల ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. కోచింగ్ సెంటర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.


మున్సిపల్ అధికారుల తీరు అధ్వానం

రెస్క్సూ టీమ్ రంగంలోకి దిగి విద్యార్థులను కాపాడింది. కాకపోతే ముగ్గురు విద్యార్థులు వరద నీటికి బలయ్యారు. ప్రతి ఏడాదీ సమ్మర్ సీజన్ లోనే డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా చెదారం తీసివేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అందరూ బీజేపీ నేతల అసమర్థతను ఎండగడుతున్నారు. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి వర్షంలోలో ప్రయాణిస్తూ అక్కడే పడివున్న విద్యుత్ తీగను చూసుకోకుండా నీటిలో నడుస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఢిల్లీ పటేల్ నగర్ లో జరిగిన ఈ సంఘటన మరవక ముందే మరో ముగ్గురు కోచింగ్ విద్యార్థులు బలయ్యారు. వర్షాలు కురవకముందే సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావని .. ఇకనైనా ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం ప్రమాదకర ప్రాంతాలను. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related News

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Big Stories

×