E-Paper
Advertisement

India vs Sri Lanka: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం

India vs Sri Lanka: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం
Advertisement

India beat Sri Lanka by 43 runs in Pallekele: శ్రీలంక పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేయగా..రిషభ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40, శుభమన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేసి శ్రీలంక ముందు భారీ స్కోరు ఉంచారు. లంక బౌలర్లలో పతిరన నాలుగు వికెట్లు తీశాడు.

Advertisement

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట ఓపెనర్లు దూకుడుగా ఆడారు. నిశాంక 48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు, కుశాల్ మెండీస్ 27 బంతుల్లో 7 ఫోర్లు సిక్స్‌తో 45 పరుగులు చేశారు. శ్రీలంక స్కోరు 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివరి ఓవరల్లో తడబడి ఓటమి పాలయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, రియాన్ సింగ్ మూడు, అర్షదీప్ రెండు వికెట్లు తీశారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×