Earthquake In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా కంపించడంతో ప్రజలకు ఆందోళనకుగురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. సోమవారం తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారి ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం తీవ్రతకు ఇంట్లోని వస్తువులు కదిలిన దృశ్యాలను ఢిల్లీ వాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకంపనలు దాటికి ఇంట్లోని వస్తువులు, ఫ్యాన్లు ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఎన్‌సిఆర్ ప్రాంతంలో తరచూ భూప్రకంపనలు చోటుచేసుకుంటాయి. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు.. ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనల తీవ్రత కనపించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read: అమెరికా బహిష్కరించిన వాళ్ల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేయడానికి కారణాలివే..
ఈ భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని.. నేషనల్ సెంటర్ సీస్మోలజీ స్పష్టం చేసింది. రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగాం ప్రాంతాల్లో భూమి కంపించినట్లు వెల్లడించింది.
కాగా ఢిల్లీలో భూప్రకంపనలపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.
Just Look at the Blast and Wave it was something else still thinking about it
My Home CCTV video #earthquake #Delhi pic.twitter.com/AiNtbIh9Uc— Mahiya18 (@mooniesssoobin) February 17, 2025