BigTV English

US deportees : అమెరికా బహిష్కరించిన వాళ్ల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేయడానికి కారణాలివే..

US deportees : అమెరికా బహిష్కరించిన వాళ్ల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేయడానికి కారణాలివే..

US deportees : అక్రమ వలసదారులుగా  గుర్తించి అమెరికా నుంచి బయటకు పంపుతున్న వలసదారులకు సంకెళ్లు వేస్తుండడం చాన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. భారత్ వంటి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే సమయాల్లో వలసదారులకు దాదాపు 60 గంటల పాటు చేతులకు, కాళ్లకు సంకెళ్లు బిగించి ఉంచడాన్ని తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. అయితే.. ఇదంతా  ఓ కారణంతోనే జరుగుతోంది అంటున్నారు అమెరికన్  అధికారులు. తాము ఏదీ అనవసరంగా చేయమని, ప్రతీదాని వెనుకా ఓ కారణం ఉందంటున్నారు.  రెండో సారి దేశంలోని వచ్చిన అనేక మంది వలసదారులు సైతం అమెరికా సైనికాధికారులు చెబుతున్న మాటలతో ఏకీభవిస్తున్నారు. దేశం నుంచి పంపించేస్తున్న వారికి సంకెళ్లు వేయడం సరైనదే అని అనిపిస్తోందంటూ.. 60 గంటల పాటు సంకెళ్లతో కూర్చున్న యువకులు చెబుతున్నారు. ఎందుకంటే..


రెండో దఫా అమెరికా నుంచి యూఎస్ సైనిక విమానంలో వచ్చిన 117 మందిలో  చాలా మంది పురుషులే ఉన్నారు. వారంతా.. చేతులకు సంకెళ్లు వేసి తీసుకువచ్చిన వాళ్లే. అయితే.. దారి మధ్యలో టాయిలెట్ కు వెళ్లే సమయంలో సంకెళ్లు తీశారని చెబుతున్న వలసదారులు.. ఆ తర్వాత మళ్లీ సంకెళ్లు బిగించినట్లు చెబుతున్నారు. వాస్తవానికి.. తమను అధికారులు అక్రమ వలసదారులుగా గుర్తించి, తీసుకెళ్తున్నప్పుడు అమెరికా కలలు చెదిరిపోయాయని నిరాశ ఆవహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చాలా మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం తాము చూశామని, కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియనట్లుగా ప్రవర్తించడం ఆందోళన కలిగించిందన్నారు. 

అమెరికాలో విమానం ఎక్కించిన సమయంలో  అక్రమ వలసదారుల భద్రతను కాపాడేందుకే సంకెళ్లు విధించాలనే ఆంక్షలు విధిస్తున్నట్లు అర్థమవుతోందంటున్నారు. విమానం గాల్లో ఉండగా.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే.. అందరి ప్రాణాలూ ప్రమాదంలో పడతాయి. అందుకే.. ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీసే అవకాశాలు లేకుండా బహిష్కరణ విధించిన వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు బిగించారని అంటున్నారు. 


పంజాబ్ కు చెందిన ఓ యువకుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..  25 ఏళ్ల మన్దీప్ సింగ్ అనే యువకుడు తన అనుభవాల్ని పంచుకున్నాడు. గతంలో వచ్చిన వారిలాగే.. తమకు చేతులకు సంకెళ్లు వేసి బంధించారని తెలిపాడు. అయితే.. ప్రతి ఒక్కరి భద్రత కోసమే ఇది జరిగింది అన్నాడు. ఎందుకంటే ఇతరుల మానసిక స్థితిని ఎవరూ అంచనా వేయలేరని, వారంతా నిరాశలో ముంచేశాయని అన్నారు. ఆ ఉద్వేగంలో యువకులు ఏలాగైనా ప్రవర్తించవచ్చు.  అలా జరిగితే..  కేవలం ఒకరిద్దరికే కాదు, మొత్తం విమానంలోని వారందరికీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారు.

ఎవరేమనుకున్నా… యూఎస్ తన చట్టాలను పాటిస్తోంది. అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు, వారు కచ్చితంగా పాటించాల్సిందే. వాస్తవానికి అధికారులు చేతులు, కాళ్లకు సంకెళ్లు వేస్తున్నప్పుడు అంతా చాలా ఇబ్బందిగానే ఫీల్ అయ్యారని, కానీ.. అది అందరి భద్రత కోసమే అని అధికారులు వివరించినప్పుడు.. నిజమే అనిపించిదని చెబుతున్నారు. బహిష్కరణ తర్వాత తామంతా మానసికంగా మంచి స్థితిలో లేమని చెబుతున్న యువకులు.. వారిలో చాలా మంది నిరాశకు గురయ్యారని చెబుతున్నారు. అటువంటి స్థితిలో ఏదైనా జరగవచ్చు. చేయండి లేదా చావండి అనే స్థితిలో చాలా మంది ఉద్రేకంగా ప్రవర్తిస్తున్నారంటూ యువకులు చెబుతున్నారు. ఆ రకమైన నిరాశ వారికే మాత్రమే కాకుండా విమానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రమాదాన్ని కలిగిస్తుందని.. అందుకే.. అలా చేయడాన్ని ఇప్పుడు తప్పుపట్టలేకపోతున్నామని అన్నారు.

కాగా.. వీరంతా ఆస్తులు అమ్ముకుని మరీ అమెరికాలో అడుగుపెట్టిన వాళ్లే కావడం గమనార్హం. ఒక్కో ఏజెంట్‌కు దాదాపు రూ. 45 లక్షల వరకు చెల్లించి, అమెరికాలో ప్రవేశించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అమెరికాలో వాళ్లను అరెస్ట్ చేసిన తర్వాత.. తమ కళ్ల ముందు ఆస్తులు విక్రయించిన దృశ్యాలు, కఠినమైన మార్గాలను దాటుకుని ఆ దేశంలోకి అడుగుపెట్టిన క్షణాలతో పాటు ఉద్యోగం, ఆహారం కోసం  చేసిన శ్రమ కంటిముందు కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ప్రభుత్వం వ్యాపారం చేసే సంస్థ కాదు – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధికారులు తమతో ఎక్కడా అనుచితంగా ప్రవర్తించలేదని చెబుతున్న వలసదారులు.. బహిష్కరణ ఎదుర్కొని తిరిగి వచ్చిన వారిలోని చిన్నారుల పట్ల మంచిగానే మెలిగినట్లు తెలిపారు. వాళ్లు చిన్నారులకు, చిన్న పిల్లలున్న తల్లులకు సంకెళ్లు వేయలేదని తెలిపారు. అలాగే.. దారిలో తినేందుకు మంచి ఆహారం ఇచ్చారని, మంచి నీరు అందించారని తెలిపారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×