Brahmamudi serial today Episode: అప్పు ఇంకో విషయం బావా అంటూ వీళ్లిద్దరి వెనక సామంత్, అనామిక ఉన్నారు అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అనామికను అందరూ తిడతారు. ఈసారి మాత్రం వాళ్లను వదిలిపెట్టేది లేదు అంటూ రాజ్ ఆవేశంగా వెళ్లిపోతాడు. సామంత్‌కు ఎవరో ఫోన్ చేసి నంద దొరికిపోయాడని చెప్తాడు. దీంతో సామంత్ ఇరిటేటింగ్‌గా ఆ నంద గాడు దొరికిపోయాడంట అంటూ ఆవేశపడతాడు. వాడు దొరికిపోతే మనం కూడా దొరికిపోతాము. నీకు అర్థం అవుతుందా..? అంటాడు. నెవర్ అలా జరగడానికి వీలులేదు. సంథింగ్ ఈజ్ రాంగ్.. అంటుంది అనామిక. దీంతో నువ్వు చేసింది మొత్తం రాంగే.. పోలీసోడికి డబ్బు ఇచ్చి వాడుకోవాలని చూశావు.
వాడు మనతో పాటు నంద గాడిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కోసం నంద దగ్గరకు వెళ్తుంటే.. ఆ అప్పు పట్టుకుందట.. వాడు మన గురించి కూడా చెప్పి ఉంటాడు నీకు రాజ్ సంగతి తెలియదు అంటూ భయపడుతుంటాడు. నువ్వు ఫస్ట్ అదంతా పక్కన పెట్టు ఈ డీల్ చేద్దాం పద అంటూ సామంత్‌ను కిందకు తీసుకొస్తుంది. బిజినెస్ పార్ట్‌నర్స్ తో డీల్ మాట్లాడుతుంటే కావ్య, రాజ్ వస్తారు. రాజ్ కోపంగా రేయ్ సామంత్ అంటూ వచ్చి సామంత్ గల్లా పట్టుకుంటాడు. ఎందుకు చేశావురా ఈ పని అంటూ సామంత్‌ను కొడతాడు. దీంతో సామంత్ రాజ్ మనం మాట్లాడుకుందాం..? అంటాడు. దీంతో రాజ్ ఏంటి వీళ్ల ముందు నీ పరువు పోతుందని ఆలోచిస్తున్నావా..? నువ్వు చేసిన పనికి గంట ముందు ఇలానే మా ఇంట్లో బ్యాంకు ఆఫీసర్లు వచ్చి నా ఇంటిని జప్తు చేయబోయారు.
మరి అప్పుడు నా పరువు పోలేదా..? చెప్పు ఎందుకు చేశావు ఇలా ..? నా వల్ల నీకు జరిగే నష్టం ఏంటి చెప్పరా..? అంటూ కొడుతుంటాడు. మధ్యలో రాజ్ వదులు.. వదిలేయ్ సామంత్‌ను అంటూ అడ్డు వస్తుంది. రాజ్ కోపంగా ఏరా మనిద్దరం వ్యాపారంలో పోటీ పడి ఉండొచ్చు. కానీ నేను ఏ రోజు నిన్ను తొక్కాలని చూడలేదు. నీ కంపెనీ కొనమని నాకు ఎన్నోసార్లు ఓపెన్ ఆఫర్ వచ్చింది. అయినా నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పిచుకోలేడు. అంటూ మళ్లీ సామంత్‌ను కొట్టబోతుంటే.. కావ్య అడ్డొస్తుంది. ఏవండ వద్దండి పదండి అని చెప్తుంటే.. మర్యాదగా మీ ఆయనను ఇక్కడి నుంచి తీసుకెళ్లు అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో కావ్య కోపంగా అనామికను కొట్టి నీకు వాగడం మాత్రమే తెలుసు నాకు కొట్టి చెప్పడం కూడా తెలుసు అంటూ కావ్య వార్నింగ్ ఇస్తుంది.
ఇంటికి వచ్చిన అప్పును కళ్యాణ్ ఎత్తుకుని రౌండ్‌గా తిప్పుతుంటాడు. కళ్లు తిరుగుతున్నాయి. దింపు అంటుంది. అప్పును కిందకు దించిన కళ్యాణ్ నువ్వు ఈ రోజు చేసిన పనికి నీకేం ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను అంటాడు. అయితే ఏమైనా ఇస్తావా..? అని అడుగుతుంది. నా శక్తికి మించైనా సరే ఇస్తాను అంటాడు కళ్యాణ్. అయితే ఇంతసేపు పొగిడిన నోటితోనే నాకు అంటూ సిగ్గుపడుతుంది అప్పు. దీంతో కళ్యాణ్.. అప్పుకు కిస్ ఇస్తాడు. ఇంతలో కరెంట్ బిల్ సార్ అంటూ ఒక అబ్బాయి వస్తాడు. ఇద్దరూ కంగారు పడతారు.
హాల్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇన్నాళ్లు నా కొడుకు కోడలు అప్పు సంగతి దాచిపెట్టలేక, బయటకు చెప్పలేక నా కొడుకు కోడలు చాలా అవస్థ పడ్డారు. ఖర్చులన్నీ ఆపేసి అందరి దృష్టిలో చెడ్డవారు అయ్యారు. ఎంతో కష్టాన్ని బాధని దిగమింగి కష్టపడి అప్పును తీర్చడానికి చాలా పెద్ద బాధ్యత మోసారు. చిన్నవాళ్లు అయినా ఇంటిగుట్టును బయటకు రానీయకుండా మన వంశ గౌరవం కాపాడారు. ఇప్పటికైనా అందరి అపార్థాలు తొలగిపోయాయి అనుకుంటున్నాను. ఇక ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా అని అడుగుతుంది అపర్ణ. దీంతో సీతారామయ్య లేదమ్మా అసలు సమస్య అలాగే ఉండిపోయింది అంటాడు. ఇంకేం సమస్య ఉంది బావ అని ఇందిరాదేవి అడుగుతుంది. దీంతో ఆస్థి.. కొందరిలో స్వార్థం మొదలైంది.
మనం అనే మాట నుంచి నేను నా బిడ్డ, భర్త అనే వరకు వెళ్లింది. ఆస్థి మొత్తం ముక్కలు చేసి ఎవరి వాటా వారికి పంచాలనుకుంటున్నాను అని చెప్తాడు సీతారామయ్య. ఇంతలో ప్రకాష్ ఎమోషనల్‌గా సీతారామయ్య కాళ్ల మీద పడి అందరిలాగే నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తాడు. మాకు ఆస్థి వద్దు నాన్నా అందరం కలిసే ఉందాం.. అంటూ ఏడుస్తుంటాడు. అయితే అప్పును కోడలిగా ఒప్పుకుని మన ఇంటికి తీసుకురావాలని సీతారామయ్య చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?