Gopi Chand : టాలీవుడ్ హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ ( gopichand) సినిమాల గురించి అందరికీ తెలుసు. విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా గోపీచంద్ ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. ఈసారి తప్పకుండా హిట్ సినిమా అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ సినిమాల కథలను వింటున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే పలు సినిమాలను అనౌన్స్ చేసిన గోపీచంద్.. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలే హిట్ సినిమాలు లేని గోపీచంద్ ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడంపై ఆయన ఫ్యాన్స్ పెదవిరుస్తున్నారు. ఎందుకు బ్రో సాహసం చేయడం అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? ఆయన ఈ మధ్య తీసిన సినిమాలు ఏంటో ఒకసారి మనం చూసేద్దాం…
గోపి చంద్ సినిమాలు..
తెలుగు సినిమాల్లోకి ఆయన రంగ ప్రవేశం కొత్తగా జరిగింది.. ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్. తన డెబ్యూ మూవీ తొలి వలపు తో అందరిని ఆకర్షించాడు.. ఆ మూవీతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస సినిమాల తో బిజీ అయ్యాడు. గోపి చంద్ తేజా డైరెక్షన్ లో జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనతో మరో కోణాన్ని చూపించాడు.. యజ్ఞం సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. గత రెండేళ్లుగా ఆయన ఖాతాలో హిట్ సినిమా పడలేదు. గత ఏడాది చివరిగా విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పర్వాలేదనిపించింది కానీ మంచి హిట్ అయితే అందుకోలేకపోయింది.. ఇప్పుడు మరో ఇద్దరు డైరెక్టర్లకు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : Naga Chaithanya : లక్ అంటే ఇదే.. ఒకేసారి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌తో..
ప్లాప్ డైరెక్టర్ తో సినిమా..
వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో గోపీచంద్ ఇప్పుడు సరికొత్త కథలను ఎంచుకోవడంలో బిజీగా ఉన్నారు.. ఈ క్రమంలో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు వినిపిస్తుంది. లైగర్, డబల్ ఇస్మార్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగలడంతో ఇప్పుడైనా తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవలే గోపీచంద్ కు కథను కూడా వినిపించాడట. గతంలో వీరిద్దరి కాంబోలో గోలీమార్ అనే సినిమా వచ్చింది. యావరేజ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఇప్పుడు గోపీచంద్ తో తరికేకిస్తున్న కదా ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ అన్నారు. ఏది ఏమైనా గోపీచంద్ తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. టైం తీసుకున్న పర్లేదని హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడం బెటర్ కదా ఇలా ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తీస్తే హిట్ అవుతుందా అని ఆలోచనలో పడ్డారు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది..