E-Paper
Advertisement

పూల్ పార్టీలో ఫూలయ్యే పింక్ బికినీ పిల్ల… కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

పూల్ పార్టీలో ఫూలయ్యే పింక్ బికినీ పిల్ల… కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్
Advertisement

Comedy Drama web series: చాలామంది అమ్మాయిలకు పింక్ కలర్ అంటే చెప్పలేనంత అబ్సెషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం పింక్ కలర్ బట్టలు వేసుకుంటే పిచ్చోళ్లను చూసినట్టే చూస్తారు. అంతేనా ఎగతాళి చేసి ఏడిపిస్తారు కూడా. మరి పింక్ అంటే పిచ్చి ఉన్న మన హీరోయిన్ వీళ్లందరికీ ఎలా బుద్ధి చెప్పిందో తెలియాలంటే ‘ఎల్లీ: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ లీగల్లీ బ్లాండ్’ (Elle: From the World of Legally Blonde) అనే సిరీస్ ను చూడాల్సిందే. 2026 జూలై 1న విడుదలై యువతను అలరిస్తున్న ఈ యూత్ ఫుల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1995 సంవత్సరంలో స్టోరీ నడుస్తుంది. లాస్ ఏంజిల్స్‌లోని బెల్-ఎయిర్‌లో విలాసవంతమైన జీవితం గడిపే పిల్ల ఎల్లీ వుడ్స్. కానీ ఒకరోజు హఠాత్తుగా ఆమె ప్రపంచం తలక్రిందులు అవుతుంది. ఆమె తండ్రి ప్లాస్టిక్ సర్జన్ గా పని చేస్తాడు. ఒక సర్జరీలో తప్పు చేయడం వల్ల వాళ్ళ కుటుంబం పెద్ద వివాదంలో చిక్కుకుంటుంది. దీని నుండి తప్పించుకోవడానికి సడన్ గా కాలిఫోర్నియాను వదిలి, ఎప్పుడూ వర్షం పడే సియాటిల్ నగరానికి మారాల్సి వస్తుంది.

Advertisement

సియాటిల్ అప్పట్లో గ్రంజ్ కల్చర్‌కు ప్రసిద్ధి. అంటే నలుపు దుస్తులు, రాక్ మ్యూజిక్, నిరాశావాదం నిండిన వాతావరణం ఉంటుందన్న మాట. కానీ గులాబీ రంగు దుస్తులు వేసుకుని, అమిత ఉత్సాహంతో, జ్యోతిష్యం నమ్మే ఎల్లీ ఈ వాతావరణంలో పూర్తిగా ఇమడలేకపోతుంది. కొత్త హైస్కూల్‌ లో ఆమెను అందరూ అమాయకురాలు, షోకులు చేసే అమ్మాయిగా చూసి దూరం పెడతారు. ఒక పూల్ పార్టీకి పింక్ బికినీ వేసుకుని వెళ్తే, అక్కడ అందరూ స్కేట్‌బోర్డింగ్ చేస్తున్నారని తెలిసి ఎల్లీకి పెద్ద అవమానం జరుగుతుంది.

కానీ ఆమె తన సహజ ఆశావాదాన్ని, దయాగుణాన్ని ఎప్పుడూ కోల్పోదు. పైగా ఇక్కడే తనను తాను నిరూపించుకోవాలని శపథం చేస్తుంది. మరోవైపు స్కూల్ ప్రిన్సిపాల్ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్న విషయం ఎల్లీ దృష్టికి వస్తుంది. దీనిని బయట పెట్టడానికి ఆమె తన కొత్త స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎల్లీలో దాగి ఉన్న ఇన్వెస్టిగేషన్ నైపుణ్యం, సమస్యలను ఎదుర్కొనే మొండితనం బయటపడతాయి. ఇవే భవిష్యత్తులో ఆమెను గొప్ప లాయర్‌గా మలిచే పునాదులు అన్నమాట.

Advertisement

కొత్త జీవితంలో ఎల్లీకి కొందరు నిజమైన స్నేహితులు తోడవుతారు. అలాగే ఇద్దరు అబ్బాయిలు ఆమె లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఒకరు ఆమె పాత సౌకర్యవంతమైన జీవితాన్ని గుర్తుచేస్తే, మరొకరు ఆమెను మరింత బలంగా ఎదగడానికి ప్రేరేపిస్తారు. ఈ లవ్ ట్రయాంగిల్ మధ్య ఎల్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది ? స్కూల్ ప్రిన్సిపల్ బాగోతాన్ని ఎలా బయట పెట్టింది ? అన్నది సీజన్ 1లో చూడాల్సిన కథ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

సిరీస్ లో లెట్సీ మినెట్రీ ఎల్లీ వుడ్స్‌గా చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘ఎల్లీ: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ లీగల్లీ బ్లాండ్’ ప్రస్తుతం Amazon Prime Videoలో ఉంది., త్వరలోనే సీజన్ 2 కూడా రానుంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : నగరంలో వరుస హత్యలు… పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే సీరియల్ కిల్లర్

Related News

ఈ పొగ పీలిస్తే పోతారు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్

సూర్యు శక్తిని, కాంతిని మింగేసే పురుగులు… భూమి అంతాన్ని ఆపడానికి అల్టిమేట్ అడ్వెంచర్

Sing geetham OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతున్న మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ‘సింగ్ గీతం’!

మనిషి మెదడును జంతువు శరీరంలోకి బదిలీ… హార్ట్ టచింగ్ కామెడీ సై-ఫై థ్రిల్లర్

ఈ ఇంట్లోకి అమ్మాయి అడుగు పెడితే అంతే సంగతులు… కితకితలు పెట్టే మలయాళం ఫ్యామిలీ డ్రామా

మంత్రగత్తె కావాలని కలలుగనే అమాయకపు అమ్మాయి… కట్ చేస్తే కేక పెట్టించే సీన్లు

టీనేజ్ నుంచే డేటింగ్ పిచ్చి… మనసుకు హత్తుకునే ఇంగ్షీషు మూవీ స్ట్రీమింగ్ తెలుగులో

Big Stories

Advertisement
×