E-Paper
Advertisement

Gas Cylinder Booking Rules: గ్యాస్ సిలిండర్ల ధరలు ఓకే.. మరి నిబంధనల మాటేంటి, ఇంకా ముప్పు పొంచి వుందా?

Gas Cylinder Booking Rules:  గ్యాస్ సిలిండర్ల ధరలు ఓకే.. మరి నిబంధనల మాటేంటి,  ఇంకా ముప్పు పొంచి వుందా?
Advertisement

Gas Cylinder Booking Rules:  పశ్చిమాసియా ప్రభావం ఇంకా భారత్‌పై ఉందా? ఇప్పుడిప్పుడే పెట్రోల్-డీజిల్-గ్యాస్‌పై ఆంక్షలు సడలిస్తోందా? జూలై ఒకటి చేసిన మార్పుల్లో గ్యాస్ బుకింగ్ నిబంధనల మాటేంటి? పశ్చిమాసియా ముప్పు పొంచి వుందా? అందుకే గ్యాస్ డెలివరీ నిబంధనల్లో మార్పులు చేయలేదా? వర్షాకాలం సీజన్ కావడంతో చీటికి మాటికీ గ్యాస్ వినియోగం పెరుగుతోందని అంటున్నారు వినియోగదారులు.

గ్యాస్ సిలిండర్ల ధరలు ఓకే.. మరి నిబంధనల మాటేంటి?

Advertisement

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వ్యవహారం దాదాపు మూడు నెలల పాటు ప్రపంచ దేశాలను కుదిపేసింది. హోర్మూజ్ జలసంధి మూసివేయడంతో ఆయిల్ కోసం కటకటలాడాయి ప్రపంచ దేశాలు. ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరడంతో ఇప్పుడిప్పుడే జలసంధి ద్వారా ఆయిల్ రవాణా సాఫీగా సాగుతోంది.

ఈ క్రమంలో ఈ ఏడాది జూలై ఒకటిన కీలక మార్పులు చేశాయి గ్యాస్ కంపెనీలు. ఇండేన్, భారత్, హెచ్‌పి గ్యాస్‌ కంపెనీలు కమర్షియల్ 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్లు, 5 కేజీల ఎఫ్‌టిఎల్ ఎల్‌పీజీ గ్యాస్ ధరలను తగ్గించాయి. ఎల్‌పీజీ కనెక్షన్ల రీఫిల్లింగ్‌కు సంబంధించిన 25 రోజులు, 30 రోజులు, 45 రోజుల నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

Advertisement

ముప్పు పొంచి వుందా? అందుకే నిబంధనల్లో మార్పు లేదా?

గ్యాస్ సరఫరా విషయాల్లో ఇంకా అంతరాయం వంటి సమస్యలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఎండాకాలం కావడంతో కేవలం వంటకు గ్యాస్ వినియోగించేవారు. వర్షాకాలం రావడంతో వేడి నీళ్లు వ్యవహారం వంటి కారణాలతో ఇంట్లో గ్యాస్ తొందరగా అయిపోతోంది. దీనివల్ల చాలామంది గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

పాత రూల్స్ వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఎల్పీజీ సిలిండర్లను రీఫిల్ చేయడానికి దాదాపు 25 రోజుల నిబంధన ఉంది. గ్యాస్ బుకింగ్ తేదీ మొదలు రెండో గ్యాస్ సిలిండర్ మధ్య వ్యవధి 25 రోజులు ఉండాలి. అదే పట్టణాల్లో అయితే 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల బుకింగ్ వ్యవధి ఉంది.

గతంలో గ్యాస్ బుకింగ్ చేసిన మరుసటి రోజు వచ్చేదని, ఇప్పుడు దాదాపు వారం రోజులు తీసుకుంటోందని చెబుతున్నారు. అంతేకాదు గ్యాస్ డెలివరీ రోజు నుంచి మళ్లీ గ్యాస్ ఎప్పుడు బుకింగ్ చేసుకోవాలో దానిపై మళ్లీ డేట్ ఇస్తోందని అంటున్నారు. దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

ALSO READ: అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు.. డోరీ చేప, కొత్త ఔషధాల తయారీకి

గ్యాస్ బుకింగ్ విషయంలో పాత నిబంధనలు అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి ఉంటే శీతాకాలం మరింత దారుణంగా తయారవుతుందని అంటున్నారు. యుద్ధానికి ముందు ఎల్‌పిజి బుకింగ్ వ్యవధి 21 రోజులు ఉండేది. మార్చి 2026లో 25 రోజులకు, ఆ తర్వాత 45 రోజులకు పొడిగించాయి గ్యాస్ పంపిణీ కంపెనీలు.

దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వాటిల్లో 25 రోజులకు గ్యాస్ డెలివరీ అవుతున్నా, గ్యాస్ బుకింగ్ తర్వాత మరొక వారం రోజులు తీసుకుంటోంది. పూణే, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, చండీగఢ్, కొచ్చి, సూరత్, ఇండోర్, నాగ్‌పూర్, పాట్నా, భువనేశ్వర్, విశాఖపట్నం, నోయిడా, గురుగ్రామ్ వంటి పట్టణాల్లో 30 రోజులు పద్దతి అమల్లో ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ గ్రామ పంచాయతీలు, పంచాయితీలు, గ్రామీణ బ్లాక్‌లు, గిరిజన గ్రామాలు 45 రోజుల పద్దతి అమల్లో ఉంది. దేశంలో LPG ధరలు జూలై ఒకటి నుంచి 19 కేజీల వాణిజ్యం ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 183.50లకు తగ్గింది. మామూలు గ్యాస్ విషయంలో ఎలాంటి తగ్గింపు లేదు.

Related News

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

Big Stories

Advertisement
×