E-Paper

దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!

దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!
Advertisement

TMC Crisis: బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తలెత్తిన రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతున్న మమతా బెనర్జీకి.. మరో గట్టి షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య శనివారం తన పదవికి అనూహ్యాంగా రాజీనామా చేశారు. అలాగే పార్టీలోని ఇతర బాధ్యతల నుంచి సైతం తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జూన్ 3న మమతా బెనర్జీ పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసి పార్టీని పునర్వ్యవస్థీకరించారు. ఆ సమయంలో సుబ్రతా బక్షి స్థానంలో చంద్రిమ భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆమె తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Advertisement

‘కలిఘాట్ సమావేశంలో నాకు అప్పగించిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నా. అలాగే ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న ఇతర అన్ని బాధ్యతల నుండి కూడా తప్పుకుంటున్నా. పార్టీ బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఎన్నికల సంఘం ముందు పార్టీ ప్రతినిధి బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నా’ అంటూ రాజీనామా లేఖలో చంద్రిమ భట్టాచార్య రాసుకొచ్చారు. అయితే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పట్ల తనకున్న గౌరవం ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

కాగా, రాజీనామా లేఖను సమర్పించిన వెంటనే చంద్రిమ భట్టాచార్య.. బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ తిరుబాటు వర్గ నేత రితబ్రత బెనర్జీతో భేటీ అయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో రితబ్రత బెనర్జీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న నేపథ్యంలో వీరి భేటి చర్చకు దారితీసింది. అంతకుముందు టీఎంసీ ప్రతిపక్ష నేతగా శోభందేబ్ ఛటోపాధ్యాయను మమతా బెనర్జీ నియమించింది. అయితే మెజారిటీ టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రత వైపే నిలవడం గమనార్హం.

Advertisement

మరోవైపు చంద్రమ రాజీనామాపై మమతా క్యాంప్‌కు చెందిన కీలక నేత కునాల్ ఘోష్ తీవ్రంగా స్పందించారు. ‘మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు అనుభవించినప్పుడు చంద్రమకు లేని బాధ ఇప్పుడెందుకు వచ్చింది? అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు?’ అంటూ ఘాటుగా విమర్శించారు. కాగా, చంద్రిమ భట్టాచార్య సుదీర్ఘకాలంగా.. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలిగా, నమ్మకస్థురాలిగా ఉండటం గమనార్హం.

Also Read: ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?

టీఎంసీలో చోటుచేసుకున్న తాజా పరిణామంపై బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య స్పందించారు. మమతా బెనర్జీ పార్టీపై బెంగాల్ ప్రజలతో ప్రజలతో పాటు ఆ పార్టీ నేతలకు కూడా నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు. బెంగాల్ రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని, ప్రాధాన్యతను తృణమూల్ కోల్పోయిందని సమిక్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 80 స్థానాల్లో మాత్రమే టీఎంసీ గెలిచింది. అందులోనూ అత్యధికులు పార్టీ నుంచి విడిపోయి.. రితబ్రత బెనర్జీ నాయకత్వంలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడ్డారు. అటు 20 మంది లోక్‌సభ ఎంపీలు సైతం తిరుగుబాటు జెండా ఎగురవేసి ‘NCPI’ అనే చిన్న పార్టీలో విలీనమై ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు.

Also Read: ‘నా కొడుకు నీ ఫ్యాన్.. వాడ్ని క్రిమినల్ అంటావా?’ పవన్‌పై సాయికృష్ణ తల్లి ఫైర్!

Related News

కొడుక్కి యాసిడ్ తాగించి.. ఘోరంగా చితకబాది.. హత్య చేసిన తల్లిదండ్రులు!

మ్యాగీ, హార్లిక్స్ తింటున్నారా.. జాగ్రత్త! డేట్లు మార్చి డేంజర్ బిజినెస్.. ఇదిగో వీడియో!

ఫిర్యాదు చేసేదాకా కాదు.. ముందే అడ్డుకోండి.. టెలిగ్రామ్‌కు కేంద్రం హెచ్చరిక!

మరో ఘోరం.. పాయసంతో భర్తను లేపేసిన భార్య.. బాత్రూమ్ కింద కప్పెట్టి హైడ్రామా!

నిన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. స్వామి వారి కానుకలు మాయం?

తమిళనాడులో బిగ్గెస్ట్ పొలిటికల్ త్రిల్లర్.. విజయ్ సర్కార్‌ను పడగొట్టేందుకు రూ. 180 కోట్ల సీక్రెట్ డీల్!

చిన్నారుల రక్షణపై రాజీ పడం.. ఇన్‌స్టాగ్రామ్‌కి కేంద్ర నోటీసులు!

Big Stories

×