E-Paper
Advertisement

Ludhiana Encounter: పంజాబ్ లూథియానలో ఎన్కౌంటర్.. ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఇద్దరికి బుల్లెట్ గాయాలు

Ludhiana Encounter: పంజాబ్ లూథియానలో ఎన్కౌంటర్.. ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఇద్దరికి బుల్లెట్ గాయాలు
Advertisement

Ludhiana Encounter: లూథియాన నగరంలో జరిగిన ఎన్కౌంటర్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మద్దతుదారులైన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇటీవల పాకిస్తాన్ ఐఎస్‌ఐ పంజాబ్, హర్యానా, బీహార్ ప్రాంతాల్లో గుప్త మాడ్యూల్స్ ఏర్పాటు చేసి.. పలు వ్యక్తులను రహస్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ మాడ్యూల్‌కు సంబంధించిన కీలకమైన ఆధారాలు లూథియానా పోలీసులు ఇప్పటికే సేకరించారు.

Advertisement

ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు వారి వద్ద నుండి.. రెండు చైనా తయారీ గ్రెనేడ్‌లు, సరిహద్దు అవతల నుండి దిగుమతి చేసుకున్న ఐదు అధునాతన పిస్టళ్లు, లైవ్ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు.. కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో బీహార్ భోజ్‌పూర్‌కు చెందిన అర్ష్, హర్యానా ఫతేహాబాద్‌కు చెందిన అజయ్, పంజాబ్ లూధియానాకు చెందిన షంషేర్ ముగ్గురికి వేర్వేరు బాధ్యతలు అప్పగించబడినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న వర్చువల్ నంబర్ ద్వారా హ్యాండ్లర్ సూచనలు అందుతున్నట్లు విచారణలో బయటపడింది.

Advertisement

తాజా సమాచారంతో అప్రమత్తమైన లూథియానా పోలీసులు.. ఉగ్రవాదుల కోసం ప్రత్యేకంగా పన్నిన ఉచ్చును అమల్లోకి తెచ్చారు. పోలీసుల బృందం వారిని అచూకీని ట్రాక్ చేసి సంఘటనా స్థలంలో చుట్టుముట్టింది. అయితే పోలీసులు సమీపిస్తుండగా ఆ ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు. హఠాత్తుగా పరిస్థితులు ఉద్రిక్తం కావడంతో పోలీసులు ప్రతీకార కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ఒకరికి మూడు బుల్లెట్లు, మరొకరికి ఒక్క బుల్లెట్ తగిలినట్లు అధికారులు తెలిపారు.

Also Read: ఆసక్తిగా కర్ణాటక రాజకీయాలు.. అధికార మార్పిడి వ్యవహారం, ఢిల్లీలో నేతలు మకాం

ఎన్కౌంటర్ అనంతరం లూథియానా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తున్న కాల్స్, వర్చువల్ నంబర్లను టెక్నికల్ బృందాలు మరింతగా పర్యవేక్షిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న స్మగ్లింగ్, డ్రగ్ కార్యకలాపాలు, ఆయుధ రవాణా నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

Related News

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

Big Stories

Advertisement
×