E-Paper
Advertisement

Bangladesh earthquake: భూకంపంతో ఆగిపోయిన బంగ్లా-ఐర్లాండ్ మ్యాచ్‌..ప‌రుగులు తీసిన ప్లేయ‌ర్లు, ప్రేక్ష‌కులు

Bangladesh earthquake:  భూకంపంతో ఆగిపోయిన బంగ్లా-ఐర్లాండ్ మ్యాచ్‌..ప‌రుగులు తీసిన ప్లేయ‌ర్లు, ప్రేక్ష‌కులు

Bangladesh earthquake: బంగ్లాదేశ్ లో భూకంపం ( Bangladesh earthquake) కలకలం రేపింది. ఉన్నపలంగా ఇవాళ ఉదయం భూకంపం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఢాకాలో ( Dhaka) ఈ భూకంపా తీవ్రత ఎక్కువగా నమోదు అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka) లో బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ ( Bangladesh vs Ireland, 2nd Test ) మధ్య రెండో టెస్టు మూడవ రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే భూకంపం చోటు చేసుకుంది. దాదాపు 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

భూకంపం క‌ల‌క‌లం.. ఆగిపోయిన మ్యాచ్‌

బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ ( Bangladesh vs Ireland, 2nd Test ) మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మయంలో భూకంపం రావ‌డంతో, మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ప్లేయర్లు ఉండిపోయారు. భూకంపం సంభవించిన వెంటనే మ్యాచ్ కూడా ఆపేశారు. అటు ప్రేక్షకులు కూడా భయంతో పరుగులు తీశారు. ఆటగాళ్లు, అంపైర్లు అందరూ పెవిలియన్ వైపు పరుగులు పెట్టారు. ఇక ఢాకా స్టేడియం దగ్గర ఉన్న మీడియా పాయింట్ కూడా ఖాళీ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇక‌ పరిస్థితి చక్క బడిన తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. అదే సమయంలో కోల్కత్తా సహా వెస్ట్ బెంగాల్లో కూడా భూకంపం సంభవించింది.

భూకంపం తీవ్ర‌త‌, 6 గురు మృతి

బంగ్లాదేశ్ లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో భారీ ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఢాకా నుంచి తూర్పు ఆగ్నేయంగా 10 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ దేశం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఇక ఈ ప్రమాదంలో ఢాకాకు చెందిన ఆరు మంది అమాయకులు మరణించారు. మరో 65 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఓ బిల్డింగ్ కూడా కుప్పకూలినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య రెండో టెస్ట్

బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య ఆ ప్రస్తుతం రెండో టెస్టు కొనసాగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 476 పరుగులు చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఐర్లాండ్ 265 పరుగులకు కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే మూడు రోజులు పూర్తయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి 77 పరుగులు రెండు ఇన్నింగ్స్ లో సాధించింది. అంటే ఓవరాల్ గా 288 పరుగుల లీడ్ సంపాదించింది బంగ్లాదేశ్.

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×