E-Paper
Advertisement

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే
Advertisement

Uttar pradesh: ఉత్తర ప్రదేశ్‌లో వింత ఘటనలు, రకరకాల కేసులు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా. కోటి ఆశలతో అత్తంటికి వెళ్లిన నవ వధువు, అదనపు కట్నం కోసం వేధింపులు తీవ్రమయ్యాయి. ఏ స్థాయిలో అంటే.. డబ్బు ఇస్తానే బాత్‌రూమ్ ఇస్తామని అత్తమామలు చెప్పేశారు. చివరకు దానికి తాళం కూడా వేశారు.

యూపీలో వింత కేసు, నవ వధువుకు అత్తింట్లో చుక్కలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని భదోహి ప్రాంతానికి చెందిన నజ్నుంకు కొద్దిరోజుల కిందట వివాహం జరిగింది. అనేక కలలతో అత్తింటికి వెళ్లిన నవ వధువు ఊహించని టార్చర్ మొదలైంది. అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు ఏ స్థాయికి వెళ్లాయంటే.. కనీసం ఇంట్లో బాత్‌రూం వాడవద్దని తేల్చిచెప్పేశారు అత్తమామలు. రూ. 50 వేలు తెచ్చిన తర్వాత బాత్‌రూం వాడాలని ఆంక్షలు పెట్టారు.

రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, తేల్చిచెప్పిన అత్తమామలు

Advertisement

అదనపు కట్నం తెచ్చే వరకు ఇంట్లోని బాత్‌రూం ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ చెప్పేశారు. చివరకు మరుగుదొడ్డికి తాళం వేశారు. ఐదు రోజుల కిందట అనగా సెప్టెంబరు 27న ఉదయం మరుగుదొడ్డి తాళం తెరిచేందుకు నవ వధువు ప్రయత్నించింది. ఆమెపై మామ, మరుదులు, ఆడ బిడ్డలు దాడి చేసి కొట్టారు. ఇంట్లో మరొక మరుగుదొడ్డి వినియోగానికి అనుమతి లేకపోవడంతో ప్రతిరోజూ అవస్థలు పడుతూ పక్కింటివారు బాత్‌రూమ్ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పట్టించుకోని భర్త, నేరుగా పీఎస్‌లో ఫిర్యాదు

వేధింపుల గురించి భర్త ఇంతియాజ్‌‌కు చెప్పినప్పటికీ, కుటుంబ సభ్యులకు భయపడి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో భర్త నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కొత్వాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాలను ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కట్నం కోసం నవవధువుకు మరుగుదొడ్డి నిరాకరించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

Advertisement

ALSO READ: దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

Related News

లాడ్జిలో ప్రియుడితో ఓ మహిళ.. సుపారీ గ్యాంగ్‌తో భార్య ఎంట్రీ, చివరకు అక్కడ ఏం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

బంధువుతో వివాహేతర బంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు.. ఏకంగా భూమిని అమ్మేసిన భార్య!

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

పహల్గాం నరమేధం సూత్రధారి ఖతం.. హాషీమ్​ మూసా శవం వద్ద డ్యాన్స్ చేసిన జవాన్లు!

ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!

ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీ ఆపరేషన్.. సముద్రంలో రూ.3,000 కోట్ల డ్రగ్ సీజ్.. సినిమా రేంజ్ ఛేజింగ్!

Big Stories

Advertisement
×