E-Paper
Advertisement

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!
Advertisement

126 Traffic Challans on One Bike: ‘చారణా కోడికి బారణా మసాలా’ అనే సామెత తరచుగా ఉంటాం. కానీ, తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన చూస్తే.. ‘బైక్‌ కు రూ.70 వేలు.. చలాన్లకు రూ.10 లక్షలు’ అని కొత్త సామెత పెట్టుకోవాల్సిందే అనిపిస్తుంది. ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా నిర్వహించిన తనిఖీల్లో బయటపడిన ఈ లెక్క చూసి వాహనదారుడే కాదు.. పోలీసులు కూడా కాసేపు షాక్‌కు గురయ్యారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

గురుగ్రామ్‌లో బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బైక్ ఆపి ఆన్‌ లైన్‌లో వెహికల్  వివరాలు చెక్‌ చేశారు. బైక్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే స్క్రీన్‌పై వరుసగా చలాన్లు కనిపించడం మొదలైంది. ఒకటి.. రెండు.. పది.. ఇరవై అంటూ లెక్క పెరుగుతుండగా చివరకు సంఖ్య 126 దగ్గర ఆగింది. ‘ఇంతకీ ఈ బైక్‌ నడిపిందెవరు?’ అని పోలీసులు ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. అన్నింటినీ కలిపి జరిమానా ఎంత ఉందో లెక్కిస్తే మరో షాక్‌. అక్షరాలా రూ.10,30,000!

బైక్‌ చిన్నదే.. చలాన్లే పెద్దవి!

Advertisement

ఈ లెక్క విన్న బైక్ రైడర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సాధారణంగా బైక్‌ కొంటే దాని ధర, మైలేజీ, మెయింటెనెన్స్‌ ఖర్చు గురించి ఆలోచిస్తాం. కానీ, ఈ బైక్‌ విషయంలో మాత్రం ‘చలాన్ల చరిత్ర’ కూడా ఒక ఫీచర్‌గా మారిపోయింది. ఎందుకంటే, ఆ పాత బైక్ ధర సుమారు రూ.70 వేలే. అంటే బైక్‌ రేట్ కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువగా చలాన్లు బాకీ ఉన్నాయి.

హెల్మెట్‌ నుంచి నంబర్‌ ప్లేట్‌ వరకు!

ఇంత పెద్ద మొత్తంలో జరిమానా ఎందుకు వచ్చిందా అని చూస్తే.. వాయిలేషన్స్ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, వాహనానికి పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం, నంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డుపై తిరగడం లాంటి పలు ఉల్లంఘనలు చాలాసార్లు నమోదయ్యాయి. అంటే ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వెళ్లిన ప్రతి ప్రయాణం.. తర్వాత ఒక చలాన్‌గా వచ్చిందన్నమాట. చివరకు పోలీసులు ఆ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గత నెలలోనూ ఇలాంటి షాకే!

Advertisement

ఇది ఒక్కటే ఘటన కాదు. గురుగ్రామ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు గత నెల సెప్టెంబరులోనూ దాదాపు ఇదే తరహా కేసు ఎదురైంది. అప్పుడు ఓ బైక్‌పై 113 పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. వాటన్నింటినీ కలిపితే జరిమానా మొత్తం రూ.10,68,500గా తేలింది. దీంతో ఆ బైక్‌ను కూడా పోలీసులు సీజ్‌ చేశారు.

Read Also: టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

Tags

Related News

ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

చెప్పడం కాదు.. చేసి చూపించాడు.. పైలట్‌ బాధ్యత గురించి స్మిత్ మచ్చర్ పాత పాడ్‌కాస్ట్ వైరల్!

ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!

రైలు టికెట్ బుక్ చేశారా? ప్రయాణం కుదరకపోతే సింపుల్ గా వేరొకరికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు!

ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×