BigTV English

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ..? యూపీ నుంచి పోటీ..?

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ..? యూపీ నుంచి పోటీ..?

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తాడా? అది కూడా తన తండ్రి బరిలోకి దిగిన ఉత్తర ప్రదేశ్‌ నుంచి .. బిగ్‌బీ గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అలహాబాద్‌ నుంచే అభిషేక్ బచ్చన్ రంగంలోకి దిగబోతున్నాడా? మరి, ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారు? అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా గెలవగా.. ఈ విషయంలో అభిషేక్ మాత్రం సెపరేట్ రూట్‌లో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.


బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరలో రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా 4 దశాబ్దాల క్రితం అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీతో ఫ్రెండ్‌షిప్ కొద్దీ ఆయన పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు అమితాబ్‌ బచ్చన్. అలహాబాద్ నుంచి పార్లమెంట్ బరిలో నిలిచారు. లోక్‌దళ్ అభ్యర్థిపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు బిగ్‌బీ. ఆ తర్వాత రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపలేదు. కానీ బచ్చన్ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో కొనసాగుతూనే ఉంది. బిగ్‌బీ భార్య జయాబచ్చన్ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భర్త బిగ్‌బీ కాంగ్రెస్ మాజీ ఎంపీ కాగా.. భార్య జయ సమాజ్‌వాదీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల పుత్రరత్నం అభిషేక్ బచ్చన్ తన ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని దాదాపు డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. అమితాబ్ గెలిచిన ప్రయాగ్‌రాజ్ నుంచే పోటీ చేయాలని అభిషేక్ భావిస్తున్నా… తన తల్లిని రాజ్యసభకు పంపిన సమాజ్‌వాదీ పార్టీ తరఫున రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ను వీఐపీల నియోజకవర్గంగా పిలుస్తుంటారు. యూపీ రాజకీయాల్లో చాలా ప్రత్యేక స్థానం ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇక్కడి నుంచే గెలిచారు. ప్రధానమంత్రి అయ్యారు. మరో మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అలియాస్ వీపీ సింగ్ కూడా ప్రయాగ్‌రాజ్‌ నుంచే పార్లమెంట్‌కు వెళ్లారు. బీజేపీలో సీనియర్ నాయకుడైన మురళీమనోహర్ జోషి వంటి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రీటా బహుగుణ ఎంపీగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. తర్వాత బీజేపీ ప్రాబల్యం కొనసాగుతున్నప్పటికీ.. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది. 2004, 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రేవతి రమణ్‌సింగ్ గెలిచారు. గంగా-యమున-సరస్వతి కలిసే త్రివేణి సంగమంగా అలహాబాద్ దేశమంతా తెలుసు. నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చి స్పెషల్ ఫోకస్‌ పెడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ అభిషేక్ బచ్చన్‌ను బరిలో నిలపడం ద్వారా రాష్ట్రమంతా తమవైపు చూసేలా మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్కెచ్ వేస్తున్నారు. సమాజ్‌వాదీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బచ్చన్ ఫ్యామిలీ ఉపయోగపడుతుందని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. మరి, అభిషేక్ బచ్చన్ పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతాడా?


Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×