E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Bengal Politics: పాపం.. బెంగాల్‌లో టీఎంసీ పరిస్థితి, అభిషేక్ బెనర్జీ ఇంటిపై రాళ్ల దాడి

Bengal Politics: పాపం.. బెంగాల్‌లో టీఎంసీ పరిస్థితి, అభిషేక్ బెనర్జీ ఇంటిపై రాళ్ల దాడి
Advertisement

Bengal Politics: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు రెట్టింపు అయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు సార్ అంటూ పిలిచిన అధికారులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా ఏం చెయ్యాలో తెలియని ఆ పార్టీ అగ్రనేతలు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది.

బెంగాల్‌లో టీఎంసీ పరిస్థితి మరింత దారుణం

Advertisement

కోల్‌కతాలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సదరు ఎంపీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ఎంపీ అభిషేక్ ఇంటి మీదుగా ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి టూ వీలర్‌పై వెళ్తున్నాడు. ఇంతలో అభిషేక్ ఇంటి ముందు ఆగి పెద్ద రాళ్లను తీసుకుని కిటికీలపైకి రెండుసార్లు విసిరాడు. ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమైంది. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో కోల్‌కతా పోలీసుల భద్రతా కియోస్క్ ఉంది. ఆ సమయంలో పోలీసులు ఎవరు లేరు.

Advertisement

ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై రాళ్ల దాడి

ఈ ఘటనపై ఎంపీ అభిషేక్ బెనర్జీ సీరియస్ అయ్యారు. ఈ దాడి వెనుక బీజేపీ గూండాల ప్రమేయముందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ప్రస్తుతం గూండా రాజ్ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

ఎవరి ఆదేశాల మేరకు అక్కడ లేకుండా పోయారని నిలదీశారు. అధికారుల రక్షణ ఎవరికి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. నిందితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు వీలు కల్పించే బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్-2026 బిల్లు నిబంధనలు బీజేపీ పాలకులకు వర్తించవా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.

ALSO READ: అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి..! విచారణలో నిందితుడి సంచలన నిజాలు!

అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం నెల రోజుల్లో ఇది రెండోసారి. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు సోనార్‌పూర్‌ వెళ్లినప్పుడు ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. ఇప్పుడు సొంత నివాసంపై రాళ్ల దాడి జరగడంతో టీఎంసీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

మరోవైపు ఇప్పుటికే ఆ పార్టీలో చీలికలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభ మెజార్టీ ఎంపీలు ఎవరికివారు గ్రూపులుగా పెట్టుకున్నారు.  స్పీకర్‌ని కలవడం ఆపై తిరుగుబాటు దారులకు ప్రతిపక్ష స్థానం ఇవ్వడం జరిగిపోయింది. ఓ వైపు ఇలాంటి పరిణామాలు జరుగుతుండగా, మరోసారి ఏకంగా ఇంటిపై రాళ్ల దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

 

Related News

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి..! విచారణలో నిందితుడి సంచలన నిజాలు!

పెట్రోల్‌పై ప్రత్యేక పన్ను విధింపు, నేటి నుంచి అమల్లోకి, అంతా మన మంచికే

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. సిలిండర్ల ధర రూ.183 తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి

కేతన్ మర్డర్ ఎఫెక్ట్.. లోహగఢ్‌కు పోటెత్తిన పర్యాటకులు.. క్రైమ్ స్పాటే టార్గెట్!

Chennai: రాఘవ లారెన్స్ డ్రాప్.. తిరుచ్చి నుంచి త్రిష ఖాయం?

రైతన్నలకు ఊరట.. 23 రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షాలు!

మధ్యాహ్న భోజనంలో ‘గుడ్డు’ బంద్.. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా?

Big Stories

×