E-Paper
Advertisement

ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం
Advertisement

Omar Abdullah: పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 1947లో పాక్ సైనిక మూకలను ఎదిరించి భారత్ లో చేరాలని కాశ్మీరీలు తీసుకున్న నిర్ణయం ఏంతో సరైనదని వ్యాఖ్యానించారు. ఆ నిర్ణయం ఎంత మంచిదో.. ప్రస్తుతం పాక్ ఆధీనంలోనే పీవోకే ప్రజల దుస్థితిని చూస్తుంటే అర్థమవుతోందని చెప్పారు. శ్రీనగర్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

పీఓకేపై కీలక వ్యాఖ్యలు

పీఓకేలో తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు జరగడం విచారకరమని ఓమర్ అబ్దుల్లా అన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం బాధకరమని వాపోయారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను (ఆర్టికల్ 370), రాష్ట్ర హోదాను రద్దు చేయకుండా ఉంటే.. ఈపాటికి పీవోకే ప్రజలే స్వయంగా తిరుగుబాటు చేసి జమ్మూ కాశ్మీర్‌లో విలీనమయ్యేవారని ఒమర్ అభిప్రాయపడ్డారు. ఆ వైపు ఉన్న తమ సోదరుల కోసమే అసెంబ్లీలో ఇప్పటికీ కొన్ని సీట్లను ఖాళీగా ఉంచామని పేర్కొన్నారు. ఏదో ఒకరోజు అవి భర్తీ అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తాత నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ..

Advertisement

1947లో భారత సైన్యం అడుగుపెట్టడానికి ముందే.. పాకిస్తాన్ రజాకార్ల దాడిని ధైర్యంగా తన తాత, జమ్ముకాశ్మీర్ తొలి ప్రధాని షేక్ అబ్దుల్లా ధైర్యంగా ఎదుర్కొన్నారని ఓమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. ‘మాపై దాడి చేయాలని భావిస్తున్న వారికి మా హెచ్చరిక.. మేము కాశ్మీరీలము, దేనికైనా సిద్ధం’ అంటూ నాడు తమ పెద్దలు ఇచ్చిన నినాదం నేటికీ పీవోకే ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు 2019లో రద్దు చేసిన ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోవడానికి తమ ప్రభుత్వం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Also Read: తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

తీవ్రంగా ఖండించిన బీజేపీ

Advertisement

అయితే ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం లాంటి పవిత్రమైన జాతీయ పండుగ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పతాకావిష్కరణ రోజున తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడాల్సింది పోయి.. ఒమర్ రాజకీయం చేయడానికి ఈ వేదికను వాడుకున్నారని దుయ్యబట్టారు.

Also Read: జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!

Tags

Related News

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×