E-Paper
Advertisement

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్.. విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్.. విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ
Advertisement

Chennai: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కంటే.. త్రిష ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా ఆమె హాజరవుతున్నారు. విజయ్ ప్రభుత్వం ఆమెకి ఆ విధంగా ప్రయార్టీ ఇస్తోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల్లో కూడా అదే జరిగింది. అంతేకాదు వీఐపీలు కూర్చొనే తొలి వరసలో ఆమె సీటు ఏర్పాటు చేయడంపై తమిళనాడు వ్యాప్తంగా రకరకాల వార్తలు జోరందుకుంటున్నాయి.

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్

సీఎం విజయ్-త్రిష గురించి ఇటీవలకాలంలో రకరకాల వార్తలు జోరందుకున్నాయి. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు నుంచి వీరిద్దరి మధ్య రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. ఏదైనా గ్రాండ్ ఈవెంట్ జరిగితే దానికి నటి త్రిష కూడా హాజరుకావడం జరుగుతోంది. తాజాగా శనివారం తమిళనాడులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం విజయ్, ఆయన కుటుంబసభ్యులతోపాటు నటి త్రిష కూడా హాజరయ్యారు.

విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ

Advertisement

ముఖ్యమంత్రి విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు ఆమె మొదటి వరుసలో కూర్చున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు చీర ధరించిన త్రిష, సీఎం విజయ్ రాక కోసం ఎదురుచూస్తున్న ఓ వీడియోలో కనిపించారు. మరో క్లిప్‌లో తల్లి ఉమాకృష్ణన్‌తో కలిసి వచ్చింది. సీఎం విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్- శోభా చంద్రశేఖర్‌ల పక్కన కూర్చుని కనిపించింది. సీఎం విజయ్ పరేడ్, జెండా ఆవిష్కరణ  సమయంలో ఆమె సీటు నుంచి లేచి సెల్యూట్ చేసింది.

 

తమిళనాడు వ్యాప్తంగా రకరకాల వార్తలు

Advertisement

విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇలాంటి ఘటన కనిపించింది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమానికి హాజరైన త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. సీటులో కూర్చునే ముందు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్నినెలలుగా విజయ్- త్రిషల రిలేషన్ షిప్ గురించి ఆన్‌లైన్‌లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. పుకార్లు కంటిన్యూ అవుతున్నప్పటికీ వీటిపై వాళ్లిద్దరు బహిరంగంగా స్పందించిన సందర్భం లేదు.

ALSO READ: రైల్వే జాబ్స్.. ఆర్ఆర్‌బి జూనియర్ ఇంజినీర్ 4,098 ఖాళీలు.. వెంటనే అప్లై చేసేయండి

గతంలో వీరిద్దరు అనేక సినిమాల్లో కలిసి నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలైంది. అంతెందుకు.. తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ రోజు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంది త్రిష. విజయ్ సన్నిహితురాలిగా నిత్యం వార్తల్లోకి వస్తోంది త్రిష. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఉదయానిధి అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె లభించిన గౌరవం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఇస్తున్న ప్రాధాన్యతను అక్కడి రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపిస్తోంది.

 

Related News

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

Big Stories

Advertisement
×