E-Paper
Advertisement

రూపాయికి ఇన్ని వస్తువులా? స్వాతంత్ర్యం నాటి నిత్యావసరాల ధరలు చూస్తే షాకవుతారు!

రూపాయికి ఇన్ని వస్తువులా? స్వాతంత్ర్యం నాటి నిత్యావసరాల ధరలు చూస్తే షాకవుతారు!
Advertisement

1947 vs 2026 inflation comparison:  స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో లీటరు పెట్రోల్ కేవలం 25 పైసలు, 10 గ్రాముల బంగారం రూ.88 మాత్రమే ఉండేదని చెబితే ఇప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కాలం మారుతున్న కొద్దీ ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి. 1947 నాటి స్వాతంత్ర్య కాలం నుంచి నేటి 2026 వరకు మన దేశంలో పెట్రోల్, పాలు, బంగారం ధరలు ఏ విధంగా మారిపోయాయో, ఆ కాలానికి ఇప్పటికి ఉన్న విపరీతమైన వ్యత్యాసం గురించిన ఆసక్తికర విశేషాలను ఇప్పుడు చూద్దాం.

మన దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో.. గతం నాటి ఆర్థిక పరిస్థితులను నేటి కాలంతో బేరీజు వేసి చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లో రూపాయి విలువ, వస్తువుల ధరలు ఎంత తక్కువ ఉండేవో చూస్తే నేటి ధరలతో నమ్మలేనంత తేడా కనిపిస్తుంది.

ఒకప్పుడు 25 పైసలకే  పెట్రోల్:

Advertisement

ప్రస్తుం ఏ కుటుంబం నెలవారీ బడ్జెట్‌లోనైనా పెట్రోల్ ఖర్చు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ.. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లీటరు పెట్రోల్ ధర కేవలం 25 నుంచి 27 పైసల మధ్య మాత్రమే ఉండేది. వివిధ చారిత్రక ఆధారాల ప్రకారం అప్పట్లో ఇంధన ధరలు అత్యంత తక్కువగా ఉండేవి. కానీ నేడు 2026 నాటికి ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటి కొనసాగుతోంది. కేవలం పెట్రోలే కాకుండా అప్పట్లో లీటరు ఫుల్-క్రీమ్ పాలు కేవలం 12 నుంచి 20 పైసలకే లభించేవి, కానీ నేడు రూ.60 దాటిపోయాయి.

రూ.88లకే తులం బంగారం:

బంగారం ధరల విషయానికి వస్తే.. ఈ వ్యత్యాసం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. 1947లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 88.62 మాత్రమే ఉండేది. కానీ దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక మార్పుల కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. 2025 నాటికి రూ. 1 లక్ష మార్కును దాటిన పసిడి ధర, ప్రస్తుత 2026 ఆగస్టు నాటికి 10 గ్రాములు ఏకంగా రూ. 1.5 లక్షలకు పైగా పలుకుతోంది. స్వాతంత్ర్య కాలం నాటితో పోలిస్తే బంగారం ధరలు వేల రెట్లు పెరిగిపోయాయి.

Advertisement

బియ్యం నుంచి సైకిళ్ల వరకు… అన్నీ తక్కువే!

అప్పట్లో కేవలం పెట్రోల్, బంగారం మాత్రమే కాదు, అన్ని నిత్యావసరాలు చాలా తక్కువ ధరకే దొరికేవి. 1947లో బియ్యం కిలో సుమారు 12 పైసలు, బంగాళదుంపలు కిలో 25 పైసలు ఉండేవి. అలాగే ఒక సాధారణ సైకిల్ కొనాలంటే కేవలం 20 రూపాయలు సరిపోయేవి. కాలక్రమేణా జనాభా పెరుగుదల, ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, పన్నులు, ఉత్పాదక విలువలు పెరగడం వల్ల ఈ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

కొనుగోళ్లలో వచ్చిన మార్పులు:

గతంలోని ధరలను నేటి ధరలతో నేరుగా పోల్చడం వల్ల కేవలం ఒక అంచనా మాత్రమే వస్తుంది కానీ.. ఆ కాలపు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోలేము. అప్పట్లో సగటు ప్రజల ఆదాయాలు, ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు నేటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేవి. అప్పటి రూపాయి విలువకు, నేటి రూపాయి విలువకు చాలా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ.. నాటి లైఫ్ స్టైల్ పోల్చుకుంటే నేడు అన్నీ మారిపోయాయని స్పష్టమవుతోంది.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దేశ ప్రయాణం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి ప్రయాణంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, ప్రజల జీవనశైలి, ఆదాయాలు కూడా మారుతూ వచ్చాయి. చరిత్ర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా ప్రణాళికలు చేసుకోవడమే ప్రస్తుతం అవసరం.

Tags

Related News

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×