E-Paper
Advertisement

‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!

‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!
Advertisement

False Bomb Threat: ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యక్తి చేసిన తెలివి తక్కువ పని.. తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తన బ్యాగులో బాంబు ఉందంటూ అందరినీ హడలెత్తించిన అతడ్ని.. ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వల్ల ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం సుమారు గంటపాటు ఆలస్యమైంది.

అసలేం జరిగిందంటే?

ఆగస్టు 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E333) బయలుదేరేందుకు సిద్ధమైంది. టేకాఫ్‌కు ముందు విమాన సిబ్బంది ప్రయాణికుల వద్ద లైటర్లు, కత్తెర్లు, మద్యం వంటి నిషేధిత వస్తువులేవీ లేవని నిర్ధారించుకోవడానికి సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వర్సోవాకు చెందిన అనుజ్ జయరామ్ అనే ప్రయాణికుడిని ప్రశ్నించగా.. తన బ్యాగులో ‘బాంబు’ ఉందంటూ సమాధానమిచ్చాడు.

అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్

Advertisement

ప్రయాణికుడి వ్యాఖ్యతో సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులను, సీఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా అనుజ్ జయరామ్‌ తో పాటు ఆయన రెండు బ్యాగులను విమానం నుంచి కిందకు దింపేశారు. అలాగే విమానంలో ఉన్న 100 మందికి పైగా ప్రయాణికులను కూడా కిందకు దించి బాంబు స్క్వాడ్, భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. వారి జయరామ్ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

సరదాగా అన్నానన్న నిందితుడు

దీంతో వెంటనే అనుజ్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అనుజ్ జయరామ్ తాను వ్యాపార పనిమీద ఢిల్లీ వెళ్తున్నానని, కేవలం సరదాగానే ఆ మాట అన్నానని చెప్పాడు. ఇండిగో అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే నిందితుడ్ని ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు డీసీపీ నిమిత్ గోయల్ తెలిపారు.

Advertisement

Also Read: రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

ప్రయాణికుడిపై ఇండిగో చర్యలు

మరోవైపు సదరు ప్రయాణికుడిని ఇండిగో సంస్థ ‘అన్‌రూలీ ప్యాసింజర్’గా ప్రకటించింది. ఆయన భవిష్యత్తులో ఇండిగో విమానంలో ప్రయాణించే వీలు లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తనిఖీలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read: జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!

Tags

Related News

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×