Baba Ramdev: జెన్ జీ ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వాలు పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల్లో కదలిక మొదలైంది. యువతీయువకులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా గురు బాబా రాంబేవ్ ఓ బాంబు పేల్చారు. జెన్ జీ ఉద్యమాలు ఉంటాయని తేల్చిచెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి చోటు చేసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాందేవ్.. ఈ విధంగా జెన్ జీకి అస్త్రం ఇచ్చారా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
దేశంలో విద్యార్థుల నిరసనలు.. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు యోగా గురువు రామ్‌దేవ్ బాబా. యువతీ యువకుల్లో పెరుగుతున్న నిరసనలు.. విద్య-ఉపాధి వ్యవస్థల్లో తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని అన్నారు. శనివారం స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పతంజలి యోగపీఠంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడం దీనికి కారణంగా చెప్పారు. ఫలితంగా విద్యార్థులు వీధుల్లోకి రావడానికి కారణమైందన్నారు.
అదే సమయంలో పేపర్ లీక్ వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వాలకు ఇంకా సమయం ఉందని, వ్యవస్థను సంస్కరించాలన్నారు. లేకపోతే దేశంలో మరిన్ని ఉద్యమాలు ఖాయమని తేల్చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో కొందరు అధికారులు.. కులం, మతం, ప్రాంతాల ఆధారంగా కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీనివల్ల కష్టపడి చదివి, అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని తేల్చిచెప్పేశారు. దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రజాగ్రహం మరిన్ని నిరసనలకు దారి తీయక ముందు వ్యవస్థలను సరిదిద్దుకోవాలని సూచన చేశారు.
అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా తీసుకోలేమని, ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నిరసనల పేరిట అరాచకం- హింసను ఏ మాత్రం సమర్థించనని మనసులోని మాట బయపెట్టారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు కొన్ని సూచనలు చేశారు. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి శత్రువులుగా భావించుకోకూదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు దేశంలోని అన్ని కులాలు, వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలన్నారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం, జార్ఖండ్‌లో విద్యార్థులు రోడ్డెక్కడం లాంటి నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన విషయం తెల్సిందే.
ALSO READ: ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం
Baba Ramdev ——
“Today in every field, there is chaos in our country”🥲
“The students are protesting as some find their shortage of teachers, some find there are paper leaks”😭♨️
“In interviews, only cast bias is predominant in giving marks”🥲
“Also, interview board are taking… pic.twitter.com/IWHfJw5UB9
— Prajjwal’s POV (@YPRAJJWAL) August 15, 2026