Big Stories

SASCOF: ‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి’

Above – normal monsoon rainfall predicted: సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్ లుక్ ఫోరం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా వర్షాలు కురుస్తాయని.. అవికూడా సాధారణాన్ని మించి కురుస్తాయని తెలిపింది. అయితే, ఆగస్టు-సెప్టెంబర్ మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారత్ లో సాధారణం కంటే అధికంగానే వానలు పడొచ్చని ఇప్పటికే అనుకుంటుండగా తాజా అంచనాలు వాటిని మరింతబలపరుస్తున్నాయి. జూన్-సెప్టెంబర్ మాసంలో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధరణాన్ని మించి వానలు కురుస్తాయని, ఉత్తర, ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే కొంచెం తక్కువ వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్ లుక్ ఫోరం పేర్కొన్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News