BigTV English

Aero India: ఏరో ఇండియా ప్రదర్శన షురూ.. విమానాల విన్యాసాలు అదుర్స్..

Aero India: ఏరో ఇండియా ప్రదర్శన షురూ.. విమానాల విన్యాసాలు అదుర్స్..

Aero India: బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ఏరో ఇండియా 2023 షోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాల విన్యాసాలను మోదీ వీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. ఈ ఎయిర్‌షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీ పాల్గొన్నారు. స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి ‘గురుకుల్‌’ విన్యాసానికి నాయకత్వం వహించారు. ఏరో ఇండియా ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌ వేగా నిలుస్తుందని
ప్రధాని మోదీ అన్నారు.


ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఇది. ‘ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’ పేరిట నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన 5 రోజులపాటు జరుగుతుంది. 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు విన్యాసాలు ప్రదర్శిస్తారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఎయిర్‌బస్‌, బోయింగ్‌, లాక్హీడ్‌ మార్టిన్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, సాబ్‌, సఫ్రాన్‌, రోల్స్‌ రాయీస్‌, ఎల్‌ అండ్‌ టీ, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, బీఈఎంఎల్‌ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

ఈ ఎయిర్‌షోలో భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య 251 ఒప్పందాలు కుదురుతాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటించారు. ఒప్పందాల విలువ రూ.75 వేల కోట్లు ఉంటుందని తెలిపారు.


Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×