Air India Flight: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో పెను ముప్పు తప్పింది. కొచ్చి నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం (AI-681), ముంబైకి చేరుకుని ల్యాండ్ అవుతున్న సమయంలో.. రన్‌వే మీద జారిపోయింది. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో పలువురు ప్రయాణికులు వెంటనే విమానం నుంచి దిగిపోయారు. అయితే సకాలంలో పైలట్ అప్రమత్తమవడంతో.. పెద్ద ప్రమాదం తప్పినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
ఘటనా వివరాలు
భారీ వర్షాలు కారణంగా ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై నీరు చేరింది. ఉదయం 10:15 సమయంలో AI-681 విమానం ల్యాండింగ్ సమయంలో.. అనూహ్యంగా స్లిప్ అయింది. విమాన చక్రాలు రన్‌వే మీద ట్రాక్ నుంచి బయటకు జారినట్టు భావిస్తున్నారు. దీనితో ప్రయాణికులంతా ఒక్కసారిగా కలవరపడ్డారు. కొందరికి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా వివరణ:
ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, విమానంలో 127 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా బయటకు పంపించాం. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
ముంబై విమానాశ్రయ అధికారులు స్పందన:
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MIAL) అధికారులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, రన్‌వే పరిస్థితిని పునర్విచారణ చేశాం. ల్యాండింగ్ సమయంలో వర్షపు నీరు ఎక్కువగా ఉండడం వల్లే టైర్ ట్రాక్షన్ లోపించింది. వెంటనే ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపాం. ప్యాసింజర్లకు పూర్తి సహాయం అందించాం అని తెలిపారు.
భద్రతా చర్యలు:
ఈ ఘటన అనంతరం విమానాశ్రయంలో.. భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. రన్‌వే పై నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపడుతోంది. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
పైలట్‌ను ప్రశంసలు:
ఈ ప్రమాదాన్ని సకాలంలో అదుపులోకి తీసుకురావడంలో.. కీలక పాత్ర పోషించిన పైలట్‌కు ఎయిరిండియా యాజమాన్యం ప్రశంసలు వెల్లువెత్తించాయి. ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు అని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి అన్నారు.
Also Read: విమానం ఘటన.. విదేశీ మీడియా ప్రచారంపై మంత్రి రామ్మోహన్ క్లారిటీ
ఈ ఘటన ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ.. వర్షాకాలంలో విమాన ప్రయాణాల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం స్పష్టమవుతోంది. విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ సంస్థలు పటిష్టమైన రన్‌వే నిర్వహణ, క్లయిమేట్ కంట్రోల్ చర్యలను మరింత అమలు చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన.. మరోసారి వాతావరణ పరిస్థితులు విమాన సురక్ష్యంపై ఎంత ప్రభావం చూపగలవో గుర్తుచేసింది.
Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safe
More details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD
— The Times Of India (@timesofindia) July 21, 2025