BigTV English

Ambani Costly Gifts: అంబానీ పెళ్లి గిప్ట్‌లు చాలా కాస్ట్‌లీ గురూ.. ఒక్కోటీ రెండు కోట్లు..

Ambani Costly Gifts: అంబానీ పెళ్లి గిప్ట్‌లు చాలా కాస్ట్‌లీ గురూ.. ఒక్కోటీ రెండు కోట్లు..

Ambani Gifts Customized Costly Watches Worth Rs 2 Crore to VIP Guests: ప్రపంచ కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మారంగంలో అగ్రగణ్యుడు వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్‌ల కుమారై రాధిక మర్చంట్‌ల పెళ్లి శుక్రవారం రోజున ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ పెళ్లి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖుల మధ్య, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీరంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా ఈ పెళ్లి దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ పెళ్లిగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.అంతేకాకుండా ఈ పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.


కొందరు జియో టారీఫ్ రేట్లతో దేశ ప్రజల మీద భారం మోపుతూ తన కొడుకు పెళ్లికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తున్నారని.. అంతేకాకుండా ప్రజల సొమ్ముతో ఇంత రచ్చ చేయడం అవసరమా అంటూ మరికొందరూ ఈ పెళ్లి వేడుకలను చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో బంగారంతో కూడిన దుస్తువులు సైతం అంబానీ కొడుకు, కోడలు ధరించడంతో నెట్టింట ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన వంటకాలు, అదిరిపోయే డెకరేషన్స్ నుండి మొదలుకొని ప్రతీది కూడా నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. అంతేకాదు ఇందులో ముఖ్యంగా బాలీవుడ్,కోలీవుడ్‌,టాలీవుడ్ నటీనటులు కాకుండా ఇంటర్నేషనల్ సింగర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Also Read: అంబానీయా, మజాకా.. స్టే చేయడానికి హోటల్‌ రెంట్‌ ఎంతంటే..?


ఇంకొక మ్యాటర్ ఏంటంటే…అంబానీ వివాహానికి హాజరైన తన సన్నిహితులకు, ఆత్మీయులకు అనంత్ అంబానీ అదిరిపోయే దేశంలోనే ఎక్కడాలేని విధంగా అత్యంత ఖరీదైన చేతి వాచ్‌లను వారందరికి గిప్ట్‌గా అందజేసినట్టు తెలుస్తోంది. అడెమార్స్ పిగ్యూట్ బ్రాండ్‌కి చెందిన ఈ వాచ్ ఖరీదు సుమారు కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా.. అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ వీటిని ప్రత్యేకంగా తయారుచేయించి రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ఖాన్‌, షారుక్ ఖాన్‌, రణవీర్ సింగ్ వంటి అగ్రతారలు ఈ వాచీలు పెట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)

Tags

Related News

Pakistan Train Blast: పాకిస్థాన్‌లో పేలుళ్లు.. పట్టాలు తప్పిన రైలు

Red Sandal Smugling: తిరుపతి నుంచి ఢిల్లీకి.. 10 టన్నుల ఎర్రచందనం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Bengaluru News: యువతి ఊపిరి తీసిన చెట్టు.. బెంగుళూరులో ఘటన, ఏం జరిగింది?

CJI: సీజేఐపై దాడికి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు..

Aadhaar Updates: ఆధార్ కొత్త రూల్స్.. ఇకపై ఉచితంగా అప్డేట్, దాని అర్హతలేంటి?

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు విడతల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు

Indian Air Force: ట్రబుల్‌కి.. ట్రిపుల్ ధమాకా! భారత్ జోలికొస్తే ఊచకోతే..

Supreme Court: సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. సీజేఐపై చెప్పు విసరబోయిన న్యాయవాది, ఆపై గందరగోళం

Big Stories

×