E-Paper
Advertisement

Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?

Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?
Advertisement

Rajnath Singh: ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశ విద్యార్థులను, యువతను ఒక రాజకీయ సాధనంగా వాడుకోవడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని మా ప్రభుత్వం, విద్యార్థులు మరియు యువత యొక్క ఆకాంక్షలను, సంక్షేమాన్ని నెరవేర్చడానికి పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు.

యువతకు అన్యాయం..

మన విద్యార్థుల ప్రతి ఆందోళనను ఆలకించి, వారిని సంతృప్తి పరచడం మన బాధ్యతని అన్నారు. భారతదేశంలోని చైతన్యవంతమైన పరిణతి చెందిన, వివేకవంతులైన యువత ఇటువంటి భ్రమ కలిగించే ప్రయత్నాలను చక్కగా అర్థం చేసుకుంటారని, వారు ప్రగతి, అభివృద్ధి మరియు దేశ నిర్మాణ మార్గాన్ని ఎంచుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉందపి తెలిపారు. ఎవరికీ ముఖ్యంగా మన విద్యార్థులకు, యువతకు అన్యాయం జరగకుండా చూసేందుకు మేము కట్టుబడి ఉన్నామని, కొందరు ప్రతిపక్ష నాయకులు సృష్టిస్తున్న ఈ ఆగ్రహపూరిత భావన, ప్రజలను, ముఖ్యంగా మన పిల్లలను, యువతను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న విఫల ప్రయత్నం మాత్రమే అని తెలిపారు.

Advertisement

Also read: పండుగకు ముందు బజాజ్ బ్లాస్ట్.. ఒకేసారి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!

ప్రతిపక్షానికి మాట్లాడే స్వేచ్ఛ..

మేము యువత యొక్క భావాలు మరియు ఆందోళనల పట్ల సున్నితంగా ఉంటాము. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కానీ ప్రతిపక్షం సమస్యలను పార్లమెంట్‌లో కాకుండా వీధుల్లో పరిష్కరించుకోవడానికి అనుచితమైన ప్రయత్నాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో సమస్యలను చర్చించాల్సిన వేదిక పార్లమెంట్ భవనం, అక్కడ ప్రతిపక్షానికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, అందువల్ల, ప్రతిపక్షం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, ప్రస్తుత వర్షాకాల సమావేశాల సజావుగా సాగడానికి ఆటంకం కలిగించకుండా ఈ సమస్యలన్నింటిపై దేశ దృష్టిని పార్లమెంట్‌ వైపు మళ్లించాలని అన్నారు.

Advertisement

Also read: NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!

Related News

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..

NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Big Stories

Advertisement
×