New Delhi: దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. కాసేపటి క్రితమే రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్లే రైలు శివాజీ వంతెన వద్ద పట్టాలు తప్పింది. అదృష్టావశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. వెంటనే పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. వేగంగా పునరుద్ధరణ పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
ALSO READ: Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు
After a Plane crash in Ahmedabad, now a Train has derailed near Shivaji Bridge station
If you're living in India & still alive, thank your Luck, because that's the only thing keeping you Safe
Govt no longer cares about its people 😑 #planecrash
— 𝗩eena Jain (@DrJain21) June 12, 2025
ALSO READ: Flight Accident: గుజరాత్ ఫ్లైట్ ప్రమాదంలో.. మాజీ సీఎం విజయ్ రూపానీ.!
ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు, 20 మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతిచెందారు. ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగీస్ దేశీయులు, ఒక కెనడయన్ ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే మృతుల్లో ఇద్దరు శిశువులు, సహా 13 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం విజయ్ విజయ్ రూపానీ కూడా మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.