BigTV English

Plane Crash: భోజనం చేస్తుండగా.. కాలేజ్ హాస్టల్‌పై కూలిన విమానం.. ఆ డాక్టర్ల పరిస్థితి ఏమిటి?

Plane Crash: భోజనం చేస్తుండగా.. కాలేజ్ హాస్టల్‌పై కూలిన విమానం.. ఆ డాక్టర్ల పరిస్థితి ఏమిటి?

Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజే మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమాన ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు, 20 మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదలో ఏ ఒక్కరు కూడా బతకనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒక కెనడయన్ ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే మృతుల్లో ఇద్దరు శిశువులు, సహా 13 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది.


ALSO READ: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. గుండె బరువెక్కించే చిత్రాలు!

అయితే ఈ విమానం కాలేజీ భవనంలో కూలుతున్న సమయంలో.. అక్కడ 50 నుంచి 60 మంది మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు లంచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారంతా చనిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో 20 మందికి పైగా డాక్టర్లు మృతిచెందినట్టు వార్తలు వైరల్ అవున్నాయి. మిగిలిన డాక్లర్లకు తీవ్ర గాయాలైన తెలుస్తోంది. ప్రస్తుతం వారిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో డాక్లర్లు లంచ్ చేస్తున్న ప్లేట్ లు సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. సంబంధించిన ఫోటోలు, వీడియోలు కంటతడికి గురిచేస్తున్నాయి.


ALSO READ: Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు

లంచ్ సమయంలో కావడంతో.. విద్యార్థులు, డాక్టర్లు అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విమానం రెండు హాస్టళ్లను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. చనిపోయినవారిలో పీజీ మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు ఉన్నట్టు సమాచారం. సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఎయిరిండియా ప్రమాదంపై స్పందించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులు సమాచారం కోసం 1800 5691 444 నంబరు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు విశాఖపట్నం నుంచి హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు. అత్యవసర బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయి పరిస్థితులను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అటు అహ్మదాబాద్ విమాన ఘటనపై ఎయిరిండియా ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×