BigTV English

dreamliner 787: ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్న బోయింగ్ డ్రీమ్ లైనర్.. ఎందుకు కూలింది? ఈ విమానం ప్రత్యేకతలు ఇవే

dreamliner 787: ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్న బోయింగ్ డ్రీమ్ లైనర్.. ఎందుకు కూలింది? ఈ విమానం ప్రత్యేకతలు ఇవే

భారత దేశ విమానరంగంలోనే అత్యంత భారీ ప్రమాదం ఇది. ఎయిరిండియా సంస్థకు కూడా ఇది మాయని మచ్చలా మిగిలిపోతుంది. అంతే కాదు, అక్కడ కుప్పకూలింది బోయింగ్ విమానం. ఆ సంస్థకున్న పేరు కూడా ఈ ప్రమాదంతో కాస్త చెదిరింది. ఆ సంస్థ షేర్లు 8 శాతం పడిపోయాయి. ఈ ప్రమాదంలో తప్పెవరిది అనేది ముందు ముందు తేలుతుంది. అయితే కూలిపోయిన విమానం మోడల్ మాత్రం అత్యంత సురక్షితమైనది అనే ప్రచారం జరుగుతోంది. మరి అంత సురక్షితమైన మోడల్ ఎందుకు కూలిపోయిందో తేలాల్సి ఉంది.


బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8
అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్‌ రూపొందించిన వైడ్‌ బాడీ మోడల్స్‌లో డ్రీమ్ లైనర్ 787 కూడా ఒకటి. దీనితోపాటే డ్రీమ్ లైనర్ 777 కూడా ఉంది. ప్రస్తుతం భారత్ లో కుప్పకూలిన విమానం 787. ఇందులో మూడు కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి.

787-8 : ఇందులో 242 ప్రయాణించవచ్చు.


787-9 : ఇందులో 296 వరకు ప్రయాణించవచ్చు.

787-10 : ఇందులో 318 మంది వరకు ప్రయాణించవచ్చు.

అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మోడల్ డ్రీమ్ లైనర్ 787-8. 2011లో బోయింగ్‌ సంస్థ దీని మార్కెటింగ్ ప్రారంభించింది. ఆ మరుసటి ఏడాదే.. అంటే 2012లో ఎయిరిండియా సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 20కి పైగా డ్రీమ్ లైనర్లు ఉన్నాయి. విశ్వసనీయమైన మోడల్ కావడం, సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండటంతో.. ఎయిర్ ఇండియా, విస్తారా వంటి భారతీయ విమానయాన సంస్థలతోపాటు మొత్తం 80 కి పైగా విమానయాన సంస్థలు 1,800 కి పైగా డ్రీమ్ లైనర్లను కొనుగోలు చేశాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత బాగా ఫేమస్ అయిన మోడల్ ఇది ఒక్కటే కావడం విశేషం.

సుదూర ప్రయాణాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇతర దేశాలు, ఇతర ఖండాలకు వెళ్లే ప్రయాణాలకోసం డ్రీమ్ లైనర్ ని ఉపయోగిస్తారు. ఇది నాన్‌ స్టాప్‌ గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. క్రూజింగ్ వేగం – మాక్ 0.85 అంటే దాదాపు గంటకు 903 కిలోమీటర్లు వెళ్తుంది.

ఇతర ప్రత్యేకతలు
– డ్రీమ్ లైనర్ బాడీ 50 శాతం కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో తయారు చేయబడింది. ఈ మెటీరియల్ స్టీల్ కంటే గట్టిగా, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకొంటుంది. ఎకో ఫ్రెండ్లీ కూడా.
– పైలట్ మ్యాన్యువల్ నియంత్రణతోపాటు.. డిజిటల్ ఫ్లై-బై-వైర్ వ్యవస్థను ఇది ఉపయోగించుకుంటుంది. పైలట్ ఇన్‌ పుట్‌ ను తనకు తానుగా అర్థం చేసుకోగల టెక్నాలజీ ఉంది. వ్యక్తిగత సిస్టమ్ లోపాలు సంభవిస్తే, ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ మోడ్ లోకి మారిపోతుంది.
– ఈ విమానంలో అధునాతన క్యాబిన్ ప్రెజర్ కంట్రోల్ ఉంది.
– ఎలక్ట్రానిక్ డిమ్మింగ్‌తో పెద్ద పెద్ద కిటికీలు, అన్ని ఎగ్జిట్ లకు అత్యవసర స్లైడ్ లు అమర్చి ఉన్నాయి. లోపల అమర్చబడిన హాలోన్ ఆధారిత అగ్ని నిరోధక వ్యవస్థ ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీలపై ఆధారపడిన అధునాతన విద్యుత్ నిర్మాణం ఉంది. కాక్‌ పిట్‌లో పెద్ద-ఫార్మాట్ డిజిటల్ LCD డిస్‌ప్లే ఉంది. ప్రయాణ సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌కు మొత్తం డేటా ప్రసారం చేసేందుకు రియల్-టైమ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్‌ ఉంది. GPS-ఆధారిత నావిగేషన్, ఆటోమేటెడ్ ఫ్లైట్ పాత్ మానిటరింగ్ కూడా ఉంది.

ట్రాక్ రికార్డ్
బోయింగ్ 787 కు ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరంగా మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ విమానాలు కూలిపోయిన ఉదాహరణలు లేవు. అయితే ప్రధాన కంప్లయింట్ సాంకేతిక లోపం. గతంలో సాంకేతిక సమస్యలతో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసిన ఉదాహరణలున్నాయి. బోయింగ్‌ ఇంజినీర్‌, విజిల్‌ బ్లోయర్‌ అయిన సామ్‌ సలేపూర్‌ అనే వ్యక్తి దీని సామర్థ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బోయింగ్‌ డ్రీమ్ లైనర్ 777, 787 మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని అనేవారాయన. అయితే ఇప్పటి వరకు ప్రమాదాలు జరగకపోవడంతో ఈ ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ తొలిసారి భారత్ లో డ్రీమ్ లైనర్ కు సంబంధించి పెద్ద ప్రమాదం జరగడంతో మరోసారి బోయింగ్ సంస్థపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×