Flight Accident: గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. అక్కడ సివిల్ ఆస్పత్రి సమీపంలో బీజే మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమాన ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే విమానంలో 100 మంది ప్రయాణికులు, బీజే మెడికల్ కాలేజీలోని 20 మంది డాక్లర్లు మృతిచెందినట్టు తెలుస్తోంది. అధికారిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తోంది.
ALSO READ: Flight Crash Video: ఆహ్మాదాబాద్ విమాన ఘటన.. ఇదిగో ఇలా కుప్పకూలింది.. వీడియో వైరల్
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల వివరాలపై అధికారులు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఆహ్మాదాబాద్ ఆస్పత్రికి 40 మృతదేహాలను తరలించారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని అధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి అమిత్ షా అహ్మదాబాద్ బయల్దేరారు. మరోవైపు విశాఖపట్నం నుంచి రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫ్లైట్‌లో ఆహ్మాదాబాద్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే.
ALSO READ: Minister Rammohan Naidu: విమానం ఘటన.. కేంద్రమంత్రి రామ్మోహన్ రియాక్షన్, ప్రధాని ఆరా
అయితే, విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ, ఇతర కీలక వ్యాపార వేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అయితే.. విజయ్ రూపానీ వేరే విమానం ఎక్కారని, అయితే ఆయన పేరు కూలిపోయిన విమానంలోని ప్రయాణీకుల జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో 169 మంది భారతీయులు, బ్రిటన్ వాసులు 53 మంది, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ఆహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.