Uttarakhand IFS Officer| దేశంలో రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పదవులలో ఉన్న వ్యక్తులు మహారాజులు కాదని.. దేశం రాచరిక యుగంలో లేదని బుధవారం సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యాలు చేసింది. ఒక కేసులో నిందితుడైన ఒక ఆఫీసర్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కీలక పదవి కట్టబెట్టడంతో తలెత్తిన వివాదం సుప్రీం కోర్టు వరక చేరడంతో ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తూ.. దేశ అత్యున్నత కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నెల రోజుల క్రితం ఐండియాన్ ఫారెస్ట సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి రాహుల్ ని రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ గా నియమించారు. అయితే ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పై ఒక కేసులో ఈడి, సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలా నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారిని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎలా కీలక పదవిని కట్టబెట్టారని విమర్శలు తలెత్తాయి.
పుష్కర్ సింగ్ ధామి తన ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారని జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ వివాదంపై సుప్రీం కోర్టు లోని జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేప్పట్టింది. విచారణ సమయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ తరపున వాదించే న్యాయవాదిపై మండిపడ్డారు.
”దేశంలోని వ్యవస్థ పై ప్రజల నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు పాత రోజుల్లో లాగా రాజులు కాదు. వాళ్లు అలా వ్యవహరించడానికి వీల్లేదు. తాము చెప్పిందే జరగాలని వారు భావించకూడదు. ఆ ఐఎఫ్ఎస్ అధికారి పట్లు ముఖ్యమంత్రికి అంత ప్రత్యేక ప్రేమ ఎందుకు ఉన్నట్లు. ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏమైనా చేస్తారా?.. ఆ అధికారి ఒక సీరియస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మరి ఎలా ఆ అధికారిని అంత పెద్ద పదవిలో కూర్చోబెట్టారు?” అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
Also Read: ఉత్తర కొరియాలో వరదలు.. 30 అధికారులకు ఉరి శిక్ష వేసిన నియంత కిమ్..!
ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ గతంలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కు డైరెక్టర్ గా పనిచేశారు. అయితే అక్కడ అనుమతులు లేకుండానే చెట్లు నరికి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఈడీ, సిబిఐ అధికారులు ఆయనను విచారణ చేస్తున్నారు. ఇలాంటి అధికారిని ఉత్తరాఖండ్ రాజాజీ టైగర్ రిజర్వ్ అడవులకు డైరెక్టర్ గా నియమించడాన్ని ఉత్తరాఖండ్ ఫారెస్ట్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని సైతం విమర్శించారు. ఈ విషయాలను కూడా సుప్రీం కోర్టు విచారణ సందర్బంగా ప్రస్తావించింది.
”చీఫ్ సెక్రటరీ, అడవుల శాఖ మంత్రి ఐఎఫ్ఎస్ అధికారి నియమకాన్ని తప్పుబడుతున్నారంటే ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు ఆలోచించలేదు. దీన్నిబట్టి అర్థమవుతోంది. ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.” అని సుప్రీం కోర్టు ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించే అడ్వకేట్ నందకర్ణి సమాధానమిస్తూ.. ”ఐఎఫ్ఎస్ రాహుల్ చాలా టాలెంట్ కలవారు. అయినా ఆయనపై నేరం రుజువు కాలేదు. అలాంటి ఆఫీసర్ ఎందుకు వదులకోవాలి?” అని ఎదురు ప్రశ్నించారు.
దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మరింత మండిపడ్డారు. ”ప్రాథమిక విచారణలో ఆ అధికారికి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తేలింది. ఆ మాత్రం లేకుండానే సిబిఐ, ఈడీ విచారణ జరుగుతోందా? వెంటనే చర్యలు తీసుకోండి” అని మందలించారు.
సుప్రీం కోర్టు మండిపాటుతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఐఎఫ్ఎస్ రాహుల్ నియామకాన్ని ఉపసంహరించుకుంది.