BigTV English

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..బెయిల్ మంజూరు

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..బెయిల్ మంజూరు

Arvind Kejriwal ED Case Grant of bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అంశంలో పలు అంశాలను సెక్షన్లను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపింది. అలాగే అరెస్ట్ అక్రమమని కేజ్రీవీల్ వేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.


కేజ్రీవాల్ 90 రోజులకుపైగా నిర్భందంలో ఉన్నారని, కేజ్రీవాల్ ను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన సీఎంగా కొనసాగలా? లేదా ? అనేది ఆయన నిర్ణయానికే వదిలేసింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. తీహార్ జైలులోనే ఉండనున్నారు.

సీబీఐ కేసులో ఈనెల 17న విచారణ కొనసాగనుంది. కాగా, ఇప్పట్లో జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల అసాధ్యమేనని తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే 17న ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ ఇవ్వగా.. జూన్ 25న స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.


అయితే, బెయిల్ ప్రశ్నను పరిగణలోకి తీసుకోలేదని, పీఎంఎల్‌లోని సెక్షన్ 19ను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సెక్షన్ 19, సెక్షన్ 15 మధ్య వ్యత్యాసం వివరించింది. ఈ మేరకు పెద్ద బెంబ్ నిర్ణయం తీసుకునే వరకు కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు పేర్కొంది.

Also Read: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!

లిక్కర్ పాలసీలో కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల సమయంలో 21రోజులు సుప్రీంకోర్టు బెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి జూలై 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ వచ్చినా.. సీబీఐ కేసులో కస్టడీ పొడిగించడంతో ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×