BigTV English

Muslim Women Alimony: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!

ముస్లిం మహిళలకు విడాకుల తరువాత మాజీ భర్త భరణం చెల్లించాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుని సవాలు చేస్తూ పిటీషన్ దాఖలు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) యోచిస్తోంది. భారత రాజ్యాంగంలో ముస్లింలకు మతపరమైన విషయాలలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక చట్టాల మార్గదర్శకాలను, అమలయ్యే విధంగా చూసే బాధ్యత ముస్లిం పర్సనల్ లా బోర్డు వహిస్తుంది.

Muslim Women Alimony: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!

Muslim Women Alimony| ముస్లిం మహిళలకు విడాకుల తరువాత మాజీ భర్త భరణం చెల్లించాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుని సవాలు చేస్తూ పిటీషన్ దాఖలు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) యోచిస్తోంది. భారత రాజ్యాంగంలో ముస్లింలకు మతపరమైన విషయాలలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక చట్టాల మార్గదర్శకాలను, అమలయ్యే విధంగా చూసే బాధ్యత ముస్లిం పర్సనల్ లా బోర్డు వహిస్తుంది.


ముస్లింలకు మతపరంగా షరియా చట్టం ఉంది. షరియా చట్ట ప్రకారం.. విడాకుల తరువాత మహిళకు ‘ఇద్దత్’ (దాదాపు 100 రోజులు) గడువు పూర్తి అయ్యేవరకు మాత్రమే మాజీ భర్త భరణం చెల్లించాలి. ఆ తరువాత ఆ మహిళ స్వతంత్రంగా జీవించవచ్చు.. లేదా మరో వివాహం చేసుకోవచ్చు. గడువు పూర్తైన తరువాత మాజీ భర్తపై ఆమె బాధ్యతలు ఉండవు.

Also Read: SpiceJet staffer arrested: జైపూర్ ఎయిర్‌పోర్టు.. సీఐఎస్ఎఫ్ జవాన్ చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్ జెట్ ఉద్యోగి..


కానీ ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు.. షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉండడంతో ముస్లిం పర్సనల్ లా బోర్డు న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలనా ఖాలిద్ రాషిద్ మాట్లాడుతూ.. మన దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కు ప్రసాదించింది. మతం, సంస్కృతి.. మన జీవిన విధానలు నిర్ణయిస్తాయి. అందులో పెళ్లి, విడాకులు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ షరియా చట్ట ప్రకారం.. వివాహం అనేది జీవితాంతం కలిసి ఉండే కమిట్ మెంట్… కానీ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకొని ఆ వివాహ బంధాన్ని ముగించవచ్చు. కానీ విడాకులు జరిగిన వెంటనే ఇద్దత్.. గడువు ఉంటుంది. ఆ గడువు పూర్తైన తరువాత ఇద్దరి మధ్య ఇక ఏ సంబంధం ఉండదు. ఏ బంధం లేనప్పుడు.. మరి ఆమె ఖర్చులు, భరణం అంటూ ఎందుకు చెల్లింపులు చేయాలి. ఈ తీర్పు మగవారి పట్ల అన్యాయంగా ఉంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 25, షరియా చట్టాలను ఉల్లంఘిస్తోంది. మేము సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తాం.” అని అన్నారు.

ముస్లిం పర్సనల్ లా బోర్డుకు జామియతె ఉలెమా ఎ హింద్..సంస్థ మద్దతు తెలిపింది. జామియతె సంస్థ వైస్ ప్రెసిడెంట్ మౌలానా నజర్ మాట్లాడుతూ.. ఈ తీర్పు మన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. కోర్టు మరోసారి ముస్లిం ప్రత్యేక చట్టాలను పరీశిలించాలి అని అన్నారు.

Also Read: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!

మరోవైపు ముస్లింలలో షియా వర్గానికి చెందిన ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు జెనెరల్ సెక్రటరీ మౌలానా యాసూబ్ అబ్బాస్.. సుప్రీం కోర్టు తీర్పు సమర్థించారు. ఈ తీర్పును మతపరంగా కాకుండా మానవత్వ కోణంలో చూడాలని.. ఈ తీర్పు విడాకులు తీసుకున్న మహిళకు భద్రత కల్పిస్తోందని అన్నారు. అలాగే ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాడే.. ఆల్ ఇండియా వుమన్ పర్సనల్ లా బోర్డు.. సభ్యురాలు షాఇస్తా అంబర్.. సుప్రీం కోర్టు తీర్పును సమర్థించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×