Viral News : ఎన్ని ఘటనలు జరుగుతున్నా జనాల్లో మార్పు రావట్లేదు. పోలీసులు ఎంత కఠినంగా శిక్షిస్తున్నా మూర్ఖులు మారట్లేదు. మత విధ్వేషాలు మరీ పెరిగిపోతున్నాయి. హిందూ, ముస్లిం, క్రిష్టియన్ అంటూ సమాజంలో అలజడి రేపుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవల తెలంగాణలోని వరంగల్ జిల్లాలో.. ముస్లిం యువతితో మాట్లాడుతున్నాడని.. ఓ హిందూ యువకుడిపై దారుణంగా దాడి చేశారు కొందరు ముస్లిం యువకులు. ఆ కేసు తీవ్ర వివాదాస్పదమైంది. లేటెస్ట్‌గా ఇలాంటి ఇన్సిడెంటే.. యూపీలోనూ ముజఫర్‌నగర్‌లోనూ జరిగింది. ఓ హిందు యువకుడి బైక్ మీద వెళ్లున్న ఓ ముస్లిం యువతిని అడ్డగించి.. బురఖా లాగేసి.. ఆ ఇద్దరినీ కొట్టి.. పైశాచికంగా ప్రవర్తించారు ఆరుగురు ముస్లిం యువకులు. కట్ చేస్తే.. వాళ్లందరికీ యోగి మార్క్ పోలీస్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది అక్కడి సర్కారు. ఈ మేటర్ ఇప్పుడు నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే…
యువతిపై ఉన్మాదుల అరాచకం
యూపీలో యోగీ రాజ్యం నడుస్తోంది. రౌడీలు కనిపిస్తే కాల్చేసుడే. తప్పు చేస్తే బుల్డోజర్లు దిగుడే. ఇళ్లను కూల్చేసుడే. తోక జాడిస్తే.. లోపలేసి కాళ్లు విరగ్గొట్టుడే. రెగ్యులర్‌గా ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉన్నాం. అయినా, కొందరు సైకోలు తీరు మార్చుకోవడం లేదు. ఎంతటి పోలీస్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నా.. బ్యాడ్ బాయ్స్ మారట్లేదు. ముజఫర్‌నగర్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సచిన్ అనే యువకుడు ఓ బ్యాంక్‌లో రికవరీ ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నాడు. అదే బ్యాంక్‌లో ఓ ముస్లిం యువతి కూడా అదే పని చేస్తోంది. వాళ్లిద్దరూ కలిసి బ్యాంక్ పని మీద బైక్ మీద వెళ్తున్నారు. వారిని ఆరుగురు ముస్లిం యువకులు వేధించారు. బైక్ మీద ఫాలో అవుతూ.. టీజ్ చేస్తూ.. నాన్‌సెన్స్ చేశారు. కొంత దూరం వెళ్లాక వారి బైక్‌ను అడ్డగించారు. వాళ్ల పేర్లు చెప్పమని బలవంతం చేశారు. సచిన్ హిందువని తెలీగానే వాళ్లు మరింత రెచ్చిపోయారు. పక్కనే ఉన్న ఓ షాపులోకి తీసుకెళ్లి అతన్ని చితకబాదారు. ఆ మహిళను కూడా కొట్టారు. అందులో ఒకడు.. ఆమె ధరించిన బురఖాను బలవంతంగా లాగేశాడు. అదేదో గొప్ప పని చేస్తున్నట్టు.. ఆ దాడిని సెల్‌ఫోన్లో రికార్డు చేశారు.
యూపీలో అంతే..
ముస్లిం యువతిపై ముస్లిం యువకులే దాడి చేయడం.. ఆమెను బైక్ మీద తీసుకెళ్లినందుకు ఆ హిందూ యువకుడిని దారుణంగా కొట్టడం.. ఆ వీడియోలు బయటకు రావడంతో యూపీలో కలకలం రేపింది. అసలే అక్కడున్నది యోగీ సర్కార్. పోలీసులు ఊరుకుంటారా? వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్న ఆరుగురు యువకులను సర్తాజ్, షోయబ్, ఉమర్, అర్ష్, షాదాబ్, షమీలుగా గుర్తించారు. వెంటనే వారి కోసం వేట మొదలుపెట్టి.. పట్టుకున్నారు. ఇంకేం. ఎంచక్కా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లోపలేసి లాఠీలతో కుమ్మేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కాళ్లు వాచిపోయేలా పోలీస్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కట్ చేస్తే.. ఆ ఆరుగురు పోలీసులు స్టేషన్ నుంచి బయటకు వచ్చే వీడియోను పోలీసులే రిలీజ్ చేశారు. ఆ వీడియో అంతకంటే ఎక్కువ వైరల్ అవుతోంది ఇప్పుడు.
Also Read : యో*ని పూజ చేస్తానంటూ.. 10 లక్షలు కొట్టేసిన లేడీ అఘోరీ..
యోగి మార్క్ పోలీస్ ట్రీట్‌మెంట్
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తూ.. ఆ ఆరుగురు యువకులు అసలు నడవలేక పోతున్నారు. నిటారుగా నిలవలేక పోతున్నారు. పాదాలు వాచిపోయి ఉన్నాయి. మొకాళ్లు, పిక్కలు పగిలిపోయాయి. సీట్ చినిగిపోయింది. కుంటు కుంటూ.. నొప్పికి అరుస్తూ.. అడుగు తీసి అడుగు వేయలేని.. తీవ్ర గాయాలతో ఆ ఆరుగురు ముస్లిం యువకులు కనిపించారు. యూపీ పోలీసుల మర్యాద అలా ఉంటుంది మరి. ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
A shocking incident surfaced from #UttarPradesh's #Muzaffarnagar on Saturday, where six men allegedly attacked a #Muslim girl and a #Hindu boy. A video of the incident surfaced online. The six accused were then arrested by the police. Meanwhile, another video of the six men… pic.twitter.com/YTQUO0xJNH
— Hate Detector 🔍 (@HateDetectors) April 14, 2025