BigTV English

Turmeric Water: రోజూ గోరువెచ్చటి నీటిలో పసుపు, నెయ్యి కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా?

Turmeric Water: రోజూ గోరువెచ్చటి నీటిలో పసుపు, నెయ్యి కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా?

ఆధునిక కాలంలో రోగాలు ఎక్కువైపోతున్నాయి. వ్యాధుల బారిన పడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అందుకే ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల ప్రజల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని పెంచే అలవాట్లను పాటించడం నేర్చుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో రోజున ప్రారంభించాలని పురాతన కాలం నుంచి చెబుతూ ఉంటారు. అయితే ఆ వెచ్చని నీటిలో ఒక స్పూను నెయ్యి, చిటికెడు పసుపు కూడా వేసి చూడండి. ఆ నీటిని తాగితే ఎంతో ఆరోగ్యం.


పసుపు, నెయ్యి మీరు ఈ మూడింటి కలయిక ఎంతో శక్తివంతమైనది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పసుపులో కర్కుమిన్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుది. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, బ్యూటిరేట్, విటమిన్ ఏ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి.

నెయ్యి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇక చర్మాన్ని మెరిపించడంలో నెయ్యి తర్వాతే వెచ్చని నీటిలో నెయ్యిని కలిపినప్పుడు జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. శరీరంలోని విషయాలు వ్యర్ధాలు తొలగిపోతాయి. అలాగే శరీరం నుంచి హైడ్రేషన్ కూడా చేరుతుంది. నెయ్యిలోని కొవ్వులు, కర్కుమిన్ శోషణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల పసుపులోని కర్కుమిన్ శరీరానికి పూర్తిగా మేలు చేస్తుంది.


నెయ్యిలో బ్యూటిరేట్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగుకు ఇది ఎంతో అవసరం. గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలిపినప్పుడు ఈ పదార్థం జీర్ణవ్యవస్థను సులభంగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు జీర్ణ ఎంజైమ్ ను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరం ఆహారంలోని పోషకాలను పూర్తిగా గ్రహించగలుగుతుంది.

పసుపును వెచ్చని నీటిలో నెయ్యిని జోడిస్తే మరొక ముఖ్యమైన ప్రయోజనం ఉంది. కర్కుమిన్ సమ్మేళనం నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులతో ఇది కలిసి శరీరానికి పూర్తిగా పోషకాలను అందిస్తుంది. దాని యాంటీ ఇన్ఫ్లమేషన్ ను బలంగా మారుస్తాయి. అలాగే శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.

గోరువెచ్చని నీరు, నెయ్యి, పసుపు ఈ మూడు కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఎంతోమంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కీళ్లనొప్పులు, వాపులు వంటివి తగ్గుతాయి. కీళ్లలో ఉండే ద్రవపదార్థం అధికంగా ఉత్పత్తి అయి కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో పసుపు, నెయ్యిని కలిపి తినడం వల్ల అవి కీళ్లకు ఎంతో ఓదార్పుని ఇస్తాయి నెయ్యి చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. విటమిన్ ఏ, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు వంటివి ఉన్న నెయ్యి చర్మాన్ని మెరిపిస్తుంది.

Also Read: కర్బూజ పండుతో మస్త్ బెనిఫిట్స్.. తింటే మాములుగా ఉండదు

గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, ఒక స్పూను నెయ్యి వేసుకొని నెల రోజులు పాటు తాగి చూడండి. మీ బరువులో కూడా తగ్గుదల కనిపిస్తుంది. ఇక పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పానీయాన్ని తాగవచ్చు.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×