Case on Aghori : లేడీ అఘోరీ. నగ్నంగా తిరగడం. వర్షిణిని పెళ్లి చేసుకోవడం. అంతకుముందే ఓ పెళ్లి కావడం. ఇంతనా? అఘోరీ ఘోరాలు ఇవేనా? అంటే కాదు ఇంకా చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఒక్కోటీ బయటకు వస్తోంది. లేటెస్ట్‌గా.. యో*ని పూజ చేస్తానంటూ ఓ బాధితురాలు నుంచి 10 లక్షలు కొట్టేసినట్టు పోలీస్ స్టేషన్లో అఘోరీపై కేసు నమోదు అయింది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి.
అఘోరీపై పోలీస్ కేసు
అఘోరీ విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. తాంత్రిక పూజల పేరుతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్టు మోకిల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఫిబ్రవరి 25న fir కూడా నమోదైంది. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని అఘోరి బెదిరించినట్టు కంప్లైంట్ చేశారు.
ఫేక్.. ఫేక్..?
అఘోరీ పేరు కూడా ఫేక్ అని తెలుస్తోంది. అఘోరీ పేరు శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అని తెలుస్తోంది. ఈ పేరుతో అఘోరీకి ఆధార్ కార్డ్ కూడా ఉంది. అదే పేరుపై బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయి.
10 లక్షలు పైసా వసూల్
హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితురాలు తమకు సమస్యలు ఉన్నాయని లేడీ అఘోరీని సంప్రదించిందట. ప్రత్యేక తాంత్రిక పూజలు చేయాలని అఘోరీ ఆ మహిళను నమ్మించింది. ఆ పూజల కోసం 5 లక్షల ఖర్చు అవుతుందని చెప్పి బాధితురాలిని ఉజ్జయినికి తీసుకొని వెళ్లి పూజ చేయించింది. మరో పూజ చేయకపోతే మీకే నష్టమని చెప్పి బెదిరించి.. మరో 5 లక్షలు కూడా తీసుకుంది. రెండు దఫాలుగా మొత్తంగా 10 లక్షలు వసూల్ చేసింది.
Also Read : అఘోరీ ఎలాంటి వాడంటే.. మొదటి భార్య చెప్పిన అసలు నిజాలు
బెదిరించి.. బ్లాక్‌మెయిల్ చేసి..
అక్కడితో అయిపోలేదు అఘోరీ అరాచకాలు. చేసిన తాంత్రిక పూజల గురించి ఇంట్లో వారికి చెబుతానని బాధితురాలిని బెదిరించింది. తనకు తంత్ర విద్యలు తెలుసని.. వాటితో ఇంట్లో వారిని చంపేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేసిందని బాధితురాలు చెబుతోంది. తన భర్తకు పదే పదే కాల్ చేసి.. మరో 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు. అఘోరీ గురించి అసలు నిజాలు తెలుసుకున్న తర్వాత.. తాము మోసపోయామని గ్రహించామని.. తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. అఘోరీపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మోకిలా పీఎస్‌లో FIR కూడా నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అఘోరీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో.. లేడీ అఘోరీని అరెస్ట్ చేస్తే మళ్లీ ఏం రచ్చ జరుగుతుందోననే అనుమానంతో కూడా డిపార్ట్‌మెంట్ ఈ విషయంలో కాస్త ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీవర్షిణితో పెళ్లి.. అంతకు ముందే మరో మహిళకు తాళి కట్టారనే ఆరోపణలు.. ఇప్పుడు ఇలా పూజల పేరుతో 10 లక్షలు మోసం చేసిన చీటింగ్ కేసు.. ఇవి చాలవా అఘోరీ ఆట కట్టించేందుకు? మరి, పోలీసులు ఎందుకు ఈ కేసును లైట్ తీసుకుంటున్నారు? ఫిబ్రవరిలోనే కేసు ఫైల్ అయినా.. ఇప్పటికీ ఎందుకు అఘోరీపై చర్యలు తీసుకోలేదు?