E-Paper
Advertisement

Ayodhya : అయోధ్య రాముడు.. ఇక ‘బాలక్‌ రామ్‌’గా దర్శనం..

Ayodhya : శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir)లోని నవ నిర్మిత భవ్య మందిరంలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే, ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌ (Balak Ram)’గా పిలవనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్‌ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.

జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా పేరు పెట్టామని అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. అందుకే ఆ పేరును నిర్ణయించామని తెలిపారు. ఇకపై అయోధ్య రామ మందిరాన్ని బాలక్‌ రామ్‌ మందిరంగా పిలుస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులను మంగళవారం నుంచి అనుమతించారు. ఇక, ప్రాణప్రతిష్ఠ పూర్తవడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. రోజుకు ఆరుసార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌కు చెందిన ఆచార్య మిథిలేశ్‌నందిని శరణ్‌ వెల్లడించారు. ప్రతిరోజూ మంగళ (నిద్ర లేపేందుకు), శ్రింగార (అలంకరణ సేవలో), భోగ (నైవేద్య సమర్పణ వేళ), ఉతపన్‌ (దిష్టి తగలకుండా), సంధ్యా (సాయంత్రం వేళ), శయన హారతి (స్వామి వారిని నిద్ర పుచ్చేందుకు) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

బాల రాముడికి పూరి, కూరతో పాటు రబ్‌డీ-ఖీర్‌, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో ‘బాలక్‌ రామ్‌’ దర్శనమిస్తారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×