BigTV English

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అద్భుత ముహూర్తం పెట్టిన ఆచార్య

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అద్భుత ముహూర్తం పెట్టిన ఆచార్య

Ayodhya Ram Mandir: దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల నిజం కాబోతోంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు 84 సెక్షన్ల అమృత ఘడియలు.. అద్భుత ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ వెల్లడించారు. ఆ సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశం మారు మోగిపోతుందన్న ఆయన.. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.


యూపీలోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. భవ్య మందిర నిర్మాణం పూర్తి కానుండటంతో వచ్చే నెల 22 వ తేదీన.. అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆరోజు మంచి ముహూర్తం ఉందని.. మధ్యాహ్న సమయంలో 84 సెకన్ల పాటు శుభ గడియలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుందని అయోధ్య ట్రస్ట్‌ వెల్లడించింది.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక అత్యంత అట్టహాసంగా కన్నులపండుగగా జరగనుంది. అందుకోసం ఏర్పాట్లలో మునిగింది అయోధ్య రామ మందిర ట్రస్ట్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా.. 2 వేల 500ల ఏళ్లపాటు ఎంతటి ప్రకృతి ప్రళయమైనా తట్టుకుని నిలబడేలా డిజైన్‌ చేసినట్టు చెబుతున్నారు ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ సోంపురా. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారని.. ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందన్నారు. అలాగే ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35-40 వేల మంది భక్తులు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×