Ayodhya Shankaracharyulu : శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో పలువురు శంకరాచార్యులు బాంబు పేల్చేశారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాము హాజరుకాబోమని నలుగురు శంకరాచార్యులు ప్రకటించారు. ప్రతిష్ఠాపన వేడుకలను ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, పూరీ గోవర్ధన్‌పీఠ్ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి పూర్తిగా వ్యతిరేకించారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమేమిటని నిలదీశారు.
ఇది హిందూమతానికి విరుద్ధమన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో దేవుడిని ప్రతిష్ఠించడం మంచిది కాదన్నారు. తమ నిర్ణయం ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని.. తాము ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా కూడా వెళ్లలేమని స్పష్టం చేశారు. అలాగే శృంగేరి పీఠాధిపతి స్వామి భారతీకృష్ణాజీ, ద్వారక పీఠాధిపతి స్వామి సదానంద్ మహరాజ్ కూడా గుడి పూర్తికాకుండానే విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తుండటాన్ని వ్యతిరేకించారు. మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవం రోజైన ఈ నెల 22న అయోధ్యలోని వాల్మీకి మహర్షి ఎయిర్‌పోర్టులో ఏకంగా 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ కానున్నాయి. 500 కిలోల బరువు ఉన్న డోలు.. ప్రత్యేక రథంలో గుజరాత్ నుంచి అయోధ్యకు చేరుకుంది.
.
.