Delhi liquor scam updates(Today news paper telugu): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లోనూ సిసోడియాకు బెయిల్ లభించింది. అయితే సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే పాస్ పోర్ట్ సరెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసంది.
గతేడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా.. గత 17 నెలలుగా జైలులోనే ఉన్నారు. శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే దేశం విడిచి వెళ్లకూడదని సిసోడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఆప్ కీలక నేత సిసోడియాకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయల్‌ను మంజూరు చేస్తూ.. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అయితే ఇద్దరి పూచీకత్తులతో కూడిన రూ.10లక్షల బెయిల్ బాండ్‌ను సమర్పించాలని, విచారణ అధికారి ముందు వారానికి రెండు సార్లు సోమ, గురువారాల్లో రిపోర్ట్ చేయాలని సిసోడియాను కోర్టు ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యులను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేయవద్దని పేర్కొంది.