Road Accident: దేశంలో జాతీయ రహదారులు యమలోకానికి మార్గాలుగా మారుతున్నాయి. ప్రతీ రోజూ ప్రమాదాలు జరగని రోజు అంటూ ఏమీలేదు. తాజాగా గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నోయిడాకు చెందిన ఐటీ సేవా సంస్థ బార్క్లేస్ గ్లోబల్ సర్వీస్ సెంటర్ వైస్ ఛైర్మన్, ఆయన ఫ్యామిలీ రోడ్డు ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలోని హర్దోయ్ జిల్లాలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడాకు చెందిన ఐటీ సేవా సంస్థ బార్క్లేస్ గ్లోబల్ సర్వీస్ సెంటర్ వైస్ ఛైర్మన్ సౌరభ్ ఉపాధ్యాయ్ ఛత్ పండుగ కోసం సొంతూరు ప్రయోగరాజ్ వెళ్తున్నారు. 40 ఏళ్ల సౌరభ్‌తోపాటు అతని భార్య మేనకా ఉపాధ్యాయ్, కుమారులు వ్యోమ్ , శివోమ్‌లు నోయిడానుంచి ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరారు. సౌరబ్ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ కారు హర్దోయ్ జిల్లా భటౌలి మాఫీ గ్రామం సమీపంలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వచ్చింది.
బుధవారం మధ్యాహ్నం ఒంటి ప్రాంతంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ వాహనం దాదాపు 30 మీటర్ల దూరం డివైడర్‌పై జారుతూ వెళ్లింది. ప్రమాదం ధాటికి వాహనం ముక్కలైంది. దాని భాగాలు రహదారిపై చెల్లాచెదురయ్యాయి. 18 నెలల చిన్నారి శివోమ్ హైవేకు దాదాపు 20 అడుగుల లోతులో పడ్డాడు. మిగిలిన వారంతా కారులో మృతి చెందారు. మృతులను నోయిడాకు చెందిన ఐటీ కంపెనీ వైస్-ఛైర్మన్ సౌరభ్ ఉపాధ్యాయ్, ఆయన ఫ్యామిలీ సభ్యులుగా గుర్తించారు.
ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన సౌరబ్ ఫ్యామిలీ ఛత్ పండుగ జరుపుకోవడానికి నోయిడా నుండి తమ స్వ గ్రామానికి బయలుదేరింది. 40 ఏళ్ల సౌరభ్ ఉపాధ్యాయ్ నోయిడాలో పని చేస్తున్నారని ఆయన బావమరిది శిశిర్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని నీమ్ సరాయ్ ముండేరాలో EWS హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని పీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!
అక్కడ వైద్యులు సిపిఆర్ చేసి అతడ్ని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. సౌరభ్‌లకు 2018లో వివాహం జరిగింది. ఆయన భార్య మేనక నోయిడాలోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేశారు. చిన్న కుమారుడు శివోమ్ పుట్టకముందు 2024లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సౌరభ్ ఉపాధ్యాయ్ ఒక్కగానొక్క కొడుకు. అతని కుటుంబంలో సౌరబ్‌తోపాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారి వివాహం జరిగింది. సౌరభ్ భార్య మేనక స్వస్థలం ఘాజీపూర్. ఆమె తల్లిదండ్రులు లక్నోలోని గోమతి నగర్‌లో ఉంటున్నారు. మేనక కూడా తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె.
TRAGIC NEWS – Barclays Global Service Centre vice-chairman Saurabh Upadhyah, wife and 2 sons killed in Ganga Expressway SUV crash.
Entire family was travelling from Noida to Prayagraj to celebrate Bhai Dooj and Chhath with relatives.pic.twitter.com/zm58fpfART
— News Algebra (@NewsAlgebraIND) November 11, 2026