Bengaluru: పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి మోజులో పడి ఇప్పటివరకు భర్తలను చంపిన భార్యల గురించి విన్నాం. తన ఏకాంతానికి అడ్డు వస్తున్నాడని 24 ఏళ్ల కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ ఘటనలో షాకయ్యే విషయాలు బయటకు వచ్చాయి.
బెంగుళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మీనా నారాయణ్ వయస్సు 44 ఏళ్లు. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. ఆమెకు 24 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతోంది. బెంగళూరులో మీనా కుటుంబానికి చెందిన మూడు ఇళ్లు ఉన్నాయి. భర్త ఆస్తి అంతా ఆమె, కొడుకు విజయ్ పేర్ల మీదకు బదిలీ అయ్యాయి. ఆయా ఆస్తుల ద్వారా ఆదాయం బాగానే వస్తుంది. ఇంత వరకు స్టోరీ బాగానే సాగింది.
ఇక్కడి నుంచి మీనా నారాయణ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బెంగుళూరులో మీనా నారాయణ్‌కు 34 ఏళ్ల ఓ కారు డ్రైవరు రాకేశ్ పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త అంతర్గత రిలేషన్ షిప్‌కు దారి తీసింది. తల్లి వ్యవహారాన్ని గమనించిన కొడుకు విజయ్, తప్పుబట్టాడు. తల్లి తీరును పలుమార్లు ఖండించాడు. ఉన్న పరువు పోతుందని పదేపదే చెప్పాడు. అయినా కొడుకు మాటలను పెడ చెవిన పెట్టింది.
తన అక్రమ సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించింది కన్న తల్లి. ప్రియునితో కలిసి కొడుకు హత్యకు ప్లాన్ చేసింది. నవంబరు ఒకటిన విజయ్ సొంతూరు బెళగావికి వెళ్దామని చెప్పి ప్రియుడి రాకేశ్‌తో కలిసి కారులో తీసుకెళ్లింది. దారి మధ్యలో నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్స్ కొడుకు ఇప్పించింది. కొడుకు నిద్రలోకి జారుకున్న తర్వాత కారులో శాలువాతో కొడుకు మెడకు ఉరి బిగించి హత్య చేయించింది.
ALSO READ: ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ
బెళగావికి వచ్చేదారిలో కొడుకు మృతదేహాన్ని రహదారి పక్కన పడేసింది. ఈ హత్యకు ప్రియుడు రాకేశ్, అతడి ఫ్రెండ్స్ మరో నలుగురు సహకరించారు. నవంబర్ 3న గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో మల్మారుతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 4న మృతుడు విజయ్ తన కొడుకు అని మీనా నారాయణ్ గుర్తించింది. ఆ సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు.
తమదైన శైలిలో ఆమె సమాధానాలు చెప్పడంతో ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. చివరకు గుట్టు అంతా బయటపెట్టింది. ఈ కేసులో మీనా ప్రియుడితోపాటు మిగతా ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.