E-Paper
Advertisement

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!
Advertisement

Mammootty: మలయాళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకూ అభిమాన నటుడు మమ్ముట్టి. చాలా కూల్ గా సినిమాలు చేసుకుంటూ పోయే మమ్ముట్టి పైకి ఎలాంటి సిద్ధాంతాలూ వల్లించకపోయినా సిపిఎం పార్టీతోనూ నేతలతోనూ సన్నిహితంగా ఉంటారు. సిపిఎం నేతగానే ఆయన చెలామణిలో ఉన్నారు. సిపిఎం ఆధ్వర్యంలోని కైరళి టీవీకి ఆయన ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సిపిఎంకు చెందిన మాజీ సిఎం పినరయి విజయన్ తో అయితే మమ్ముట్టికి మరీ ఎక్కువ స్నేహ సంబంధాలున్నాయి. అయితే తాజాగా మమ్ముట్టిపై అదే సిపిఎం కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు విరుచుకు పడుతున్నారు. కైరళి టీవీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి పోవలసిందిగా తిట్టిపోస్తున్నారు. వ్యక్తిగతంగానూ మమ్ముట్టిపై మండి పడుతున్నారు.

పినరయి విజయన్ క్షమాపణలు

Advertisement

సిపిఎం క్యాడర్ అనుబంధ సోషల్ మీడియా యాక్టివిస్టులు మమ్ముట్టిపై ఇంతగా విరుచుకుపడ్డానికి మాత్రం అసలు కారణమే లేదు. ఆయన చేసిన తప్పేంటంటే..ఇటీవల ఆయన వయనాడ్ లోని ఓ బిజెపి నేత గోపాలకృష్ణ ఇంటికి వెళ్లారు.అది కూడా ఎందుకంటే ఆ బిజెపి నేత కూతురి పెళ్లికి మమ్ముట్టిని పిలిచారు. పెళ్లికి మమ్ముట్టి వెళ్లలేకపోయారు. అందుకే ఇంటికి వెళ్లి కొత్త వధువును ఆశీర్వదించాలని మమ్ముట్టి వెళ్లారు వయనాడ్ లో కార్యక్రమానికి వచ్చిన మమ్ముట్టి జిల్లా సిపిఎం నేత రఫీక్ ను మీరు ఉండిపోండి నాకు వ్యక్తిగత పని ఉందని బిజెపి నేత ఇంటికి వెళ్లారు. అంతే సిపిఎం కార్యకర్తలకు మండుకొచ్చేసింది.పెళ్లి అనేది వ్యక్తిగత కార్యక్రమం. మమ్ముట్టి కూడా వ్యక్తిగత హోదాలోనే బిజెపి నేత ఇంటికి వెళ్లారు. ఈ విచక్షణ కూడా లేకుండా సిపిఎం క్యాడర్ మమ్ముట్టిని వేటాయేడం మొదలు పెట్టారు. అది ఎంతగా అంటే ఈ మధ్యనే మమ్ముట్టిని నాలుగో సారి నేషనల్ అవార్డు వచ్చింది. బిజెపి తో క్లోజ్ గా ఉండడం వల్లనే అవార్డు వచ్చిందని వెక్కిరించేస్థాయికి కామ్రేడ్లు దిగజారిపోయారు. ఈ మొత్తం ట్రోల్ చూసి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కదిలిపోయారు. ఆయన బహిరంగంగా మమ్ముట్టికి క్షమాపణలు చెప్పారు. మమ్ముట్టి మాత్రం తనకే సాధ్యమైన చిరునవ్వుతో కూల్ గా ఉండిపోయారు. మలయాళ సీమలో మాత్రం కామ్రేడ్లు దుమారం రేపుతున్నారు.

బిజెపికి ఏమాత్రం తీసిపోని కేరళ కామ్రేడ్లు!

Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ఎవరైనా విమర్శిస్తే బిజెపి క్యాడర్ తో పాటు సంఘ్ పరివారపు అనుచరులు సోషల్ మీడియాలో విపరీతంగా విరుచుకు పడిపోతూ ఉంటారు. అది బిజెపికే పరిమితం కాదని కేరళ కామ్రేడ్లు చాటి చెబుతున్నారు.

Also Read: రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

Tags

Related News

హైస్కూల్ కుర్రాడి జాక్‌పాట్.. రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు, బహుమతి వెనుక లాజిక్ ఇదే

ఈమె తల్లి కాదు కామాంధురాలు.. ప్రియుడి మోజులో పడి, కొడుకుని చంపేంచి ఆ తర్వాత

ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!

హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం.. ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి.. అసలేం జరిగింది?

కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన నాలుగు రోజులకే, వధువు ఏం చేసిందంటే..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్య.. ప్రియురాలు హంతకురాలు, పదునైన ఆయుధంతో పలుమార్లు

Big Stories

Advertisement
×