E-Paper
Advertisement

ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ

ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ
Advertisement

AQI Delhi London| గాలి నాణ్యత బాగుందని చెప్పడానికి ఏక్యూఐ (AQI) ఒక్కటే కొలమానం కాదు. కొన్నిసార్లు ఏక్యూఐ 100 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, గాలిలో ప్రమాదకరమైన కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండవచ్చు. తాజాగా లండన్‌లో ఇదే పరిస్థితి కనిపించింది. నగరంలో ఏక్యూఐ 76గా నమోదైనా, అధికారులు హై ఎయిర్ పొల్యూషన్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం 3,036 ఏక్యూఐ స్థాయికి చేరడం అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి. అయినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఢిల్లీలో 3,036 ఏక్యూఐ అంటూ కలకలం.. లండన్‌తో పోలిస్తే ప్రభుత్వ చర్యలు ఎక్కడ?

దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటగా, 3,036 స్థాయి నమోదైందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ 3,036 అధికారిక భారత ఏక్యూఐ కొలమానం కాదు. భారత ఏక్యూఐ గరిష్ఠ స్కేల్ 500 మాత్రమే. మరోవైపు లండన్‌లో ఏక్యూఐ 76 మాత్రమే ఉన్నప్పటికీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
అక్కడ ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఢిల్లీలో మాత్రం కాలుష్య సమస్య ఏటా పునరావృతమవుతోంది. తాత్కాలిక ఆంక్షలతో సరిపెట్టకుండా, ప్రభుత్వం కఠినమైన దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

లండన్‌లో ఏక్యూఐ తక్కువగా ఉన్నా కాలుష్య హెచ్చరిక ఎందుకు జారీ చేశారు?

Advertisement

మంగళవారం లండన్ నగరంలో గాలి కాలుష్యం పెరగడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వీకెండ్స్‌లో నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనికి తోడు గాలి వేగం కూడా తక్కువగా ఉంది. దీంతో గాలిలోని కాలుష్య కారకాలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఒకేచోట పేరుకుపోయాయి.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5:28 గంటలకు లండన్ ఏక్యూఐ 76గా నమోదైంది. అయితే, ఈ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ గాలి పూర్తిగా సురక్షితమని భావించకూడదు. ముఖ్యంగా పీఎం2.5 (PM2.5) అనే సూక్ష్మ ధూళి కణాల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది.
ఈ చిన్న కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. బోన్‌ఫైర్ నైట్ వేడుకలు, దీపావళి బాణసంచా, కట్టెలు కాల్చడం వల్ల వెలువడిన పొగ కూడా కాలుష్యాన్ని పెంచి ఉండవచ్చని అధికారులు భావించారు.

కాలుష్యాన్ని తగ్గించేందుకు లండన్ మేయర్‌ సూచనలు

ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన కాలుష్య నిపుణులు హెచ్చరిక జారీ చేయాలని మేయర్ సాదిక్ ఖాన్‌కు సూచించారు. దీంతో ఆయన ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ప్రజా రవాణాను ఉపయోగించాలి: సాధ్యమైనంత వరకు బస్సులు, రైళ్లు ఉపయోగించాలి. నడిచేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు రద్దీ రోడ్లకు దూరంగా ఉండాలి.
వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలి: అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయాలి. వీలైతే ఇతరులతో కలిసి ప్రయాణించాలి. వాహనాలను ఆపి ఉంచినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయాలి.
చెత్తను కాల్చకూడదు: తోటల్లో వచ్చే వ్యర్థాలను కాల్చకుండా కంపోస్ట్ చేయాలి లేదా అనుమతి ఉన్న కేంద్రాల్లో పారవేయాలి.
కట్టెలు కాల్చడం తగ్గించాలి: ఇళ్లలో అవసరం లేకుండా కట్టెల పొయ్యిలు, ఓపెన్ ఫైర్లను ఉపయోగించకూడదు.

లండన్ ప్రజలకు కాలుష్య హెచ్చరికలు ఎలా చేరుతున్నాయి?

Advertisement

లండన్ సిటీ హాల్ కాలుష్య లెవెల్స్ బట్టి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ సమాచారం పాఠశాలలు, స్థానిక పాలనా విభాగాలకు కూడా చేరుతుంది. బస్ స్టాప్‌లలోని డిజిటల్ బోర్డులు, అండర్‌గ్రౌండ్ రైల్వే వ్యవస్థలోనూ హెచ్చరికలు ప్రదర్శిస్తారు.

వాయు కాలుష్యం ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది?

లండన్ డిప్యూటీ మేయర్ మీటే కోబన్ ప్రకారం.. విషపూరిత గాలి కారణంగా నగరంలో ఏటా వేలాది మంది అకాల మరణాలకు గురవుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎయిర్ జోన్‌ను కూడా నగరం అమలు చేస్తోంది.

Also Read: వాయు కాలుష్యం నుంచి రక్షణకు ఏ మాస్క్ ధరించాలి.. N95, N99, KN95 మధ్య తేడాలివే

ఢిల్లీ ప్రజలకు ప్రాణ హాని

దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో సీనియర్ వైద్యులు, ఊపిరితిత్తుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐఐఎంఎస్ వైద్యుడు డాక్టర్ విజయ్ హడ్డా ప్రకారం.. ఏక్యూఐ 4 అంకెల స్థాయిని దాటింది. గ్రీన్ క్రాకర్స్ కాలుష్యాన్ని 30 శాతం మాత్రమే తగ్గిస్తాయని, మిగిలిన 70 శాతం హానికర వాయువులు, ధూళి కణాలు విడుదలవుతాయని హెచ్చరించారు. ఢిల్లీలో ప్రజలు జీవించడం సురక్షితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మడియాలో చాలా మంది ఢిల్లీ పౌరులు గాలి పీలుస్తుంటే మెటల్ లాంటి వాసన వస్తోందని వీడియోలు షేర్ చేస్తున్నారు.

Also Read: భారత్‌లోకి టపాసులు ఎప్పుడు వచ్చాయి.. దీపావళి బాణాసంచా వెనుక ఇంత చరిత్ర ఉందా?

ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కార్బన్ ఉద్గారాలు.. ఇండియా మాత్రం రివర్స్

2026లో ప్రపంచ కార్బన్ ఉద్గారాలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం 4.4 శాతం పెరగనున్నాయి. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వల్ల 38.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల కానుంది. చైనా, అమెరికా, యూరప్, జపాన్‌లలో ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. భారత్‌లో మాత్రం గత పదేళ్ల సగటు వృద్ధి 3.5 శాతం కంటే ఎక్కువగా ఉద్గారాలు పెరగనున్నాయి. భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకే పరిమితం చేయడానికి మిగిలిన కార్బన్ బడ్జెట్ కేవలం 150 బిలియన్ టన్నులు మాత్రమే. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని వేగంగా పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరి దేశంలో కాలుష్యం ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు ఎలాంటి వార్తలు లేవు. అసలు ఆ మంత్రి పేరు భూపేందర్ యాదవ్ అని కూడా  చాలా మందికి లేదు. తాజాగా జరిగిన సర్వేలో ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత 100 నగరాల్లో 99 భారత దేశంలోనే ఉండడం ఆందోళనకరం. ఆ మిగిలిన ఒక్కటి లాహోర్ పాకిస్తాన్ లో ఉంది.

వాయు కాలుష్యంతో జాగ్రత్త

ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఏక్యూఐ తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయకూడదు. పీఎం2.5 వంటి నిర్దిష్ట కాలుష్య కారకాల స్థాయిని కూడా గమనించాలి. అధికారుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!

హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం.. ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి.. అసలేం జరిగింది?

కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన నాలుగు రోజులకే, వధువు ఏం చేసిందంటే..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్య.. ప్రియురాలు హంతకురాలు, పదునైన ఆయుధంతో పలుమార్లు

యూపీలో తీవ్ర విషాదం.. రీల్స్ చేసే ఇద్దరు మైనర్ బాలికలు ఒకే చెట్టుకు ఉరి! అసలేం జరిగింది?

పెళ్లైన 9 నెలలకే, వధువు ఆత్మహత్య వెనుక షాకింగ్ విషయాలు, కాన్పూర్‌లో దారుణం

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!

Big Stories

Advertisement
×