E-Paper
Advertisement

ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..

ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..
Advertisement

Bengaluru Crime: ఒకవైపు కాలకేయుడిలా వెంటాడుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు.. మరోవైపు ఎలాగైనా క్షణాల్లో డబ్బు సంపాదించాలనే విపరీతమైన పేరాశ! ఈ రెండూ కలిపి 21 ఏళ్ల ఒక నవయువకుడిని కిరాతక హంతకుడిగా మార్చేశాయి. కళ్లముందే తిరిగే అమాయక వృద్ధురాలిని ఆభరణాల కోసం పొట్టనబెట్టుకోవడమే కాకుండా, శవాన్ని సూట్‌కేసులో కుక్కి చెరువులో పడేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన ఈ హత్య కేసు మిస్టరీని కుంబళగోడు పోలీసులు చేధించి, నిందితుడైన ఆర్.గగన్ అనే యువకుడికి సంకెళ్లు వేశారు.

ఫోన్ కాల్ నెపంతో ఇంట్లోకి పిలిచి.. పక్కా ప్లాన్‌తో హత్య!
పోలీసుల కథనం ప్రకారం.. చల్లఘట్ట ప్రాంతంలో 61 ఏళ్ల జయమ్మ, నిందితుడు గగన్ ఇరుగుపొరుగున నివాసముంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసైన గగన్, రూ. లక్షల్లో అప్పులు చేసి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ క్రమంలో జయమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై అతని కన్నుపడింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం, తనకు తెలిసిన వారికి ఫోన్ చేయాలనే వంకతో జయమ్మను గగన్ తన ఇంట్లోకి రప్పించాడు. పథకం ప్రకారం ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి, గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న విలువైన ఆభరణాలన్నీ దోచుకున్నాడు.

Advertisement

సూట్‌కేసులో శవం.. ఆన్‌లైన్ ఆటోలో మృతదేహం తరలింపు!
హత్య అనంతరం పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు గగన్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. జయమ్మ మృతదేహాన్ని ఒక పెద్ద సూట్‌కేసులో బలవంతంగా కుక్కేసి సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆన్‌లైన్ యాప్ ద్వారా ఆటోను బుక్ చేసుకుని, శవం ఉన్న సూట్‌కేసుతో రామోహళ్లి వైపు పయనమయ్యాడు. తిమ్మప్ప చెరువు సమీపంలో ఆటో దిగి, చీకటి పడే వరకు వేచి చూశాడు. ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక, సూట్‌కేసును చెరువు నీటిలోకి విసిరేసి ఏమీ ఎరగనట్లు మళ్లీ తన ఇంటికి చేరుకున్నాడు.

వెతుకులాటలో నాటకాలు..
జయమ్మ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో గగన్ అసలేమీ ఎరగని అమాయకుడిలా నటిస్తూ, వారి కంటే ముందే ఉండి వెతుకుతున్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. అయితే, వారం రోజుల తర్వాత తిమ్మప్ప చెరువులో తీవ్ర దుర్వాసన వస్తూ కుళ్లిన స్థితిలో ఉన్న సూట్‌కేసును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన డీసీపీ అనితా హద్దణ్ణనవర్ నేతృత్వంలోని పోలీసు బృందం సాంకేతిక ఆధారాలు, ఆటో బుకింగ్ డేటా ఆధారంగా గగనే ఈ హత్య చేసినట్లు నిర్ధారించి బుధవారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కిరాతకుడి నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.

Advertisement

Also Read: ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!

Related News

యువత ఆందోళన తీవ్రమైన వేళ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన, పేపర్ లీక్ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

బెంగుళూరు త్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్.. జంతర్‌మంతర్ వేదికగా రగిలిన నిరసన జ్వాలలు

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

Big Stories

Advertisement
×