BigTV English
Advertisement

Bilkis Bano | లొంగిపోయేందుకు మరింత సమయం కావాలి.. సుప్రీంకు బిల్కిస్ బానో దోషులు

Bilkis Bano | గుజరాత్‌ గోధ్రా అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసు దోషులు తిరిగి జైలుకు వెళ్లడానికి మరింత సమయం కావాలని గురువారం జనవరి 18న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుండగా.. వారిలో ముగ్గురు మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారు. మిగతా దోషులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Bilkis Bano | లొంగిపోయేందుకు మరింత సమయం కావాలి.. సుప్రీంకు బిల్కిస్ బానో దోషులు

Bilkis Bano | గుజరాత్‌ గోధ్రా అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసు దోషులు తిరిగి జైలుకు వెళ్లడానికి మరింత సమయం కావాలని గురువారం జనవరి 18న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుండగా.. వారిలో ముగ్గురు మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారు. మిగతా దోషులు పరారీలో ఉన్నట్లు సమాచారం.


లొంగిపోవడానికి ఇంకా సమయం అవసరమని కారణాలు చూపుతూ.. ఒకరు తనకు ఊపితిత్తుల ఆపరేషన్ జరిగిందని చెప్పగా.. మరొకరు తన పండించిన పంట కోత సమయం చెప్పారు. మూడో దోషి తన కొడుకు పెళ్లి ఉందని కారణం చూపారు.

బిల్కిస్ బానోపై రేప్, ఆమె కుటుంబం(పిల్లలు, చెల్లెలు, తల్లి)లోని మొత్తం 11 మందిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన ఈ 11 మంది 2022 సంవత్సరంలో జైలు నుంచి శిక్షాకాలం పూర్తి చేయకుండానే విడుదల అయ్యారు. గుజరాత్ ప్రభుత్వం చొరవ తీసుకొని వీరందరినీ విడుదల చేసింది. విడుదలైన రోజు వీరందరికీ పూల మాలలు వేసి ఒక రాజకీయ పార్టీ సభ్యులు సత్కరించారు. దీంతో ఈ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది.


అయితే ఇటీవల సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని వ్యాఖ్యానిస్తూ.. బిల్కిస్ బానో దోషుల విడుదలను రద్దు చేసింది. వారందరినీ రెండు వారాల లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో 11 మంది దోషలందరూ జనవరి 21 2024 లోపు పోలీసుల వద్ద లొంగిపోవాలి.

అయితే మరో మూడు రోజుల్లో సుప్రీం కోర్టుకు ఇచ్చిన గడువు ముగిసిపోనుండగా.. ఈ దోషులలో ముగ్గురు.. లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై దేశ అత్యున్నత కోర్టు శుక్రవారం జనవరి 19న విచారణ చేపట్టడానికి అంగీకరించింది.

Related News

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

Big Stories

×