BigTV English

China Youth Unemployment : చైనాలో ఉపాధి వెతలు!

China Youth Unemployment : చైనాలో ఉపాధి వెతలు!

China Youth Unemployment : ఆర్థిక సవాళ్లలో చైనా కూరుకుపోయిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగే సెలవిచ్చారు. డ్రాగన్ దేశం 1960లో ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థికశక్తి. 2023 నాటికి రెండో స్థానానికి చేరుకోగలిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు. ఆర్థిక బుడగ ఏ క్షణంలోనైనా పేలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్థిక‌మాంద్యం, నిరుద్యోగంతో ఆ దేశం తీవ్రంగా కలత చెందుతోంది.


చైనా యూనివర్సిటీల నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.18 కోట్ల మంది యువతీయువకలు పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తారు. కొవిడ్ అనంతరం పరిస్థితుల నుంచి చైనా క్రమేపీ కోలుకుంటోంది. అయితే అదేమంత వేగంగా లేనందున ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2023 తొలి అర్థభాగంలో నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయికి చేరింది. ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నట్టు అధికారిక సర్వేల్లోనే తేలింది.

తాజా లెక్కల ప్రకారం గత నెలలో నిరుద్యోగిత రేటు 14.9%గా నమోదైంది. గత జూన్‌లో ఇది రికార్డు స్థాయిలో 21.3 శాతానికి చేరింది. గత ఆరునెలల్లో ఉపాధి రేటు కొంత మెరుగుపడినా.. కొవిడ్ ముందు నాటి పరిస్థితులకు మాత్రం ఇంకా చేరలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగంలో చేరాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. టాప్ యూనివర్సిటీ విద్యార్థులు పై చదువులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.


ఫుడాన్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 18 శాతం మాత్రమే ఉద్యోగాల్లో చేరడం దీనికో ఉదాహరణ. మిగిలిన వర్సిటీల్లోనూ అంతే. ఉన్నత చదువుల కోసం 2023లో విదేశీ బాట పట్టిన వారెందరో ఉన్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిరుడు ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉన్నత చదువుల కోసం షాంఘైలోని టాంగ్జీ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్లలో 13.6 శాతం దేశం విడిచి వెళ్లారు.

జాబ్ మార్కెట్‌లో పోటీ కారణంగా అత్యధికులు పార్ట్-టైమ్ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇక సొంత వ్యాపారంలోకి దిగేవారూ ఉన్నారు. జిలిన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లలో 4 శాతం ఈ కోవకి చెందినవారే. హ్యుబే యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో నిరుడు 21.5% మంది ఫ్రీలాన్సర్ల అవతారం ఎత్తారు. లేదంటే లేబర్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయకుండానే ఉద్యోగంలో చేరిపోతున్నారు.

చైనాలో గిగ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ ఆకర్షణీయంగా మారింది. ఫుడ్ డెలివరీ నుంచి లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ వరకు వివిధ రంగాల్లో తాత్కాలిక పద్ధతుల్లో పనిచేయడానికి సిద్ధమైపోతున్నారు. ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఇకపై కొలువులు దొరికే అవకాశాలూ సన్నగిల్లుతాయనే ఆందోళన నిరుద్యోగులను వెన్నాడుతోంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×