BigTV English

Bilkis Bano Convicts | బిల్కిస్ బానో దోషులు పరార్.. నేరస్తుల ఇళ్లముందు పోలీసు బందోబస్తు!

Bilkis Bano Convicts | బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు దోషులైన 11 మందిలో 9 మంది పరారీలో ఉన్నారని సమాచారం. వారంతా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబాలకు కూడా వారెక్కడున్నారో తెలీదని చెప్పారు.

Bilkis Bano Convicts | బిల్కిస్ బానో దోషులు పరార్.. నేరస్తుల ఇళ్లముందు పోలీసు బందోబస్తు!

Bilkis Bano Convicts | బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు దోషులైన 11 మందిలో 9 మంది పరారీలో ఉన్నారని సమాచారం. వారంతా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబాలకు కూడా వారెక్కడున్నారో తెలీదని చెప్పారు.


సోమవారం జనవరి 8న సుప్రీం కోర్టు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులకు తిరిగి పోలీసులకు సరెండర్ కావాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల తరువాత మీడియా ప్రతినిధులు గుజరాత్ దాహోడ్ జిల్లాలోని రాధికాపూర్, సింగవాద్ గ్రామాలకు వెళ్లారు. బిల్కిస్ బానో దోషులు.. ఈ గ్రామాలకు చెందినవారే. అయితే ఈ గ్రామాల్లోని దోషుల ఇళ్లకు తాళాలు కనిపించాయి. వారంతా ఇక్కడ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు వారు తెలిపారు.

దోషులలో ఒకడైన గోవింద్ భాయి(55) తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ”వారం రోజుల క్రితమే నా కొడుకు భార్య, పిల్లలతో ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు. నా కొడుకు ఎటువంటి నేరం చేయలేదు. ఏదో రాజకీయాల కారణంగా అతడిని ఈ కేసులో ఇరికించారు. జైలు నుంచి చట్టపరంగా బయటికి వచ్చాడు. అప్పటి నుంచి ఏ పనీలేక ఖాళీగా ఉన్నాడు. ఏ పనీ లేకపోతే కనీసం అయోధ్య రామమందిరంలో ఆ రాముడి సేవలో జీవితం గడపమని వాడికి చెప్పాను,” అని చెప్పారు.


ఇలాగే మరో దోషి రాధేశ్యామ్ షాహ్ 2022లో జైలు నుంచి విడుదలై వచ్చిన కొన్ని రోజుల తరువాత నుంచే ఊరి వదిలి వెళ్లిపోయడని తెలిసింది. అతడు 15 నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటునట్లు పోలీసులు తెలిపారు. మిగతా అందరి దోషుల ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయన్నారు.

బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన దోషుల కుటుంబాలపై గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారని.. వారిపై ఎటువంటి దాడులు జరగకుండా ప్రతి దోషి కుటుంబానికి రక్షణగా ఒక పోలీస్ కానిస్టేబుల్‌ని నియమించామని పోలీసులు చెప్పారు.

బిల్కిస్ బానో దోషులు 14 రోజులలోపు పోలీసులకు సరెండర్ కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారంతా కనబడకుండా పోవడం.. ఆశ్చర్యం కలిగిస్తోంది.

Related News

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Big Stories

×