BigTV English

BJP: వరుసగా ఏడోసారి అధికారం.. గుజరాత్ లో బీజేపీ కొత్త రికార్డులు..

BJP: వరుసగా ఏడోసారి అధికారం.. గుజరాత్ లో బీజేపీ కొత్త రికార్డులు..

BJP: గుజరాత్ లో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా ఏడోసారి అధికారం దక్కించుకుంది. చరిత్రలో మునుపెన్నడూ చూడని భారీ విజయాన్ని ఈ ఎన్నికల్లో సాధించింది. పశ్చిమబెంగాల్ లో సీపీఎం సృష్టించిన రికార్డును బీజేపీ సమం చేసింది. బెంగాల్ వరుసగా ఏడుసార్లు సీపీఎం గెలిచింది. 1977 నుంచి 2006 వరకు వరస విజయాలు అందుకుంది. అప్పట్లో ఆ రాష్ట్రానికి జ్యోతి బసు రెండుదశాబ్దాలుపైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో నయా రికార్డులు నమోదు చేసింది.


1990 వరకు గుజరాత్ లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అయితే 1995 ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీ పూర్తిగా చెక్ పెట్టింది. ఆ ఎన్నికల్లో 121 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తొలిసారి అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత 1998 ఎన్నికల్లో కాషాయ పార్టీ 117 స్థానాలు గెలిచి అధికారాన్ని నెలబెట్టుకుంది. గోద్రా అల్లర్లు తర్వాత జరిగిన 2002 ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 127 చోట్ల గెలిచి హ్యాటిక్ నమోదు చేసింది. 2007లో 117 స్థానాల్లో గెలిచి కాషాయ పార్టీ నాలుగోసారి అధికారం దక్కించుకుంది. 2012 ఎన్నికల్లో ఇంచుమించు ఇవే ఫలితాలువచ్చాయి. ఆ ఎన్నికల్లో 115 సీట్లు బీజేపీ కైవసం చేసుకుని అధికారం చేపట్టింది. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అంతకుముందు ప్రతి ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లుకు తగ్గకుండా గెలిచింది. అయితే 2014లో మోదీ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అతి కష్టంమీద గెలిచింది. 2017 ఎన్నికల్లో బీజేపీకి తొలిసారి వందకంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది. దీంతో బీజేపీ 99 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. కాషాయ పార్టీకి మెజార్టీకి కంటే 7 సీట్లు మాత్రమే అదనంగా వచ్చాయి.

2017 జరిగిన ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాలు తొలుత వచ్చాయి. అయితే ఆప్ బరిలోకి దిగడంతో ముక్కోణపు పోరు జరిగింది. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిపోయాయి. చాలా చోట్ల ఆప్ కు వచ్చిన ఓట్లు బీజేపీకి విజయాన్ని కట్టబెట్టాయి. దీంతో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. అందుకే గత ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ 60 స్థానాలు కోల్పోయింది. ఆప్ 5 స్థానాలతో సింగిల్ డిజిట్ కే పరిమితమైనా కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసింది. ఈ పరిణామాలన్నీ బీజేపీకి భారీగా లబ్ధి చేకూర్చాయి. అందుకే 156 స్థానాలు దక్కాయి. 1985 ఎన్నికల్లో 149 స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును తాజా ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టింది.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×